ఈ కేంద్ర బడ్జెట్ ను తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. మోడీ సర్కార్ చివరి ఎన్నికల బడ్జెట్ గా దీన్ని అభివర్ణిస్తున్నారు. బడ్జెట్ ఎలా ఉన్నా.. అధికార పక్షం అద్భుతంగా ఉందన్నారు.. ప్రతిపక్షాలు దారుణ బడ్జెట్ అంటారు. కాబట్టి బడ్జెట్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
నిర్మలా సీతారామన్ బడ్జెట్ చూస్తే.. ఉన్న పథకాలు పూర్తి చేయాలి. కొత్త పథకాల జోలికి వెళ్లకుండా చేయాలన్నది ఈ బడ్జెట్ సారాంశం. ఇంతవరకూ ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నింటిలోకి కొత్త జనాకర్షక పథకాలు వరాలు కురిపించని బడ్జెట్ ఏదైనా ఉందంటే అది ఇదేనని చెప్పొచ్చు.
నిజానికి బడ్జెట్ అంటే రాబోయే ఏడాదికి రఫ్ గా మన ఆదాయం, వ్యయాల అంచనాలు… మన అవసరాలు, వాటికి సరిపడా నిధుల సమీకరణ.. అంతే దాన్నిబట్టే నిద్ర ఖర్చు ఉండాలని ఏమీ లేదు.. ఉజ్జాయింపులు రాబోయే ఏడాదికి సంబంధించిన చిటపద్దులకు మరి ఎందుకింత ఆసక్తి? ఏమీ లేదు… గతంలో సరుకుల వారీగా పన్ను హెచ్చింపులు, తగ్గింపులు ఉండేవి కాబట్టి… సుదీర్ఘంగా బడ్జెట్ ప్రసంగాలను జనం వినేవాళ్లు.. ఇప్పుడే ముంది? ఏమీ లేదు… బడ్జెట్ కు సంబంధం లేకుండానే బాధతున్నారు కదా.. మీడియాలో కూడా ఎవరు బడ్జెట్ స్థూల అంశాల జోలికి పోరు. వాళ్లకూ అర్థం కాదు. ఏవో నాలుగు అంకెలు అటూ ఇటూ కూడి, ఏసి తీసేసి, మాయ చేసి మామ అనిపించేస్తారు.. వివిధ రంగాలకు కేటాయింపులు అని ఏవో రాస్తారు, చూపిస్తారు.. ఇక ప్రణాళిక,నాన్ ప్రణాళిక వేర్వేరు ఉంటాయి.. ఆడిటెడ్,రివైజ్డ్, బడ్జెట్లు వేరు వేరు.
సో ఈ కేంద్రబడ్జెట్ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.
