Analysis On Rajiv Gandhi Assassination : నిన్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కుట్రదారులను జైలు నుంచి విడుదల చేసింది. సాంకేతిక కారణాలను చూపుతూ ఈ పనిచేసింది. ఒకప్పుడు మరణశిక్ష వేసిన వీరందరికీ తర్వాత యావజ్జీవ శిక్షగా మార్చారు. ఇప్పుడు శిక్షాకాలం పూర్తయ్యిందంటూ విడుదల చేశారు. పిటీషన్లు వేసి వారి ప్రవర్తన బాగుందంటూ విడుదల చేయించారు.
ఒక ప్రధానమంత్రిగా వ్యక్తిని చంపింతే.. రకరకాల వాదనలు వినిపించడం విస్తుగొలిపేలా ఉంది. రాజీవ్ హత్యకు కుట్ర చేసి ఒకరిని సూసైడ్ బాంబర్ గా మార్చిన వీరంతా ముద్దాయిలు కాదట.. చంపిన వారే ముద్దాయిలట.. దోషులను కూడా సమర్థించడం ఏం మెసేజ్ ఇస్తున్నట్టో అర్థం కావడం లేదు.
మన మాజీ ప్రధాని రాజీవ్ ను చంపిన ఆరుగురిలో నలుగురు శ్రీలంక జాతీయులు.. ఇతర దేశస్థులు వచ్చి మరీ మన ప్రధానిని చంపారు. ఎల్టీటీఈ ఉగ్రవాదులు చేసిన ఈ పనిని మానవత్వంగా చిత్రీకరించడం ఏం దౌర్భగ్యమో అర్థం కావడం లేదు. ఇక దీన్ని తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే సంబరాలు చేయడంపై దేశమే నెవ్వెరపోయిన పరిస్థితి. రాజీవ్ గాంధీ హత్య కుట్రదారుల విషయంలో అవలంభిస్తున్న వైఖరిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.