Pawan Kalyan RK Beach : ఎప్పుడు సినిమాలు.. అయితే రాజకీయాలు.. కుసింత సేదతీరే సమయమే లేకపాయే.. కానీ ఇప్పుడు వీలు చిక్కింది. మోడీ పిలుపుతో విశాఖకు వచ్చిన పవన్ కళ్యాణ్ భేటి మరునాడు విశాఖ సముద్ర తీరంలో సేదతీరారు. ప్రశాంతంగా ఒక్కడే ఆ సాగర అందాలను ఆస్వాదించాడు. కాసేపు చిల్ అయ్యారు.

స్థానిక మత్స్యకారులతో మాట్లాడి వారి సమస్యలను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం విశాఖ రుషికొండ ప్రాంతాన్ని పరిశీలించారు. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, విశాఖ కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ తదితరులు పవన్ వెంట ఉన్నారు.
ప్రధాని మోడీ బస చేసిన ఐఎన్ఎస్ చోళ హోటల్ లో ప్రధాని మోడీతో భేటి అయిన పవన్ కళ్యాణ్ సుమారు 35 నిమిషాల పాటు చర్చించారు. పవన్ కళ్యాణ్ తోపాటు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ పర్యటనలకు వెళ్లేదే తక్కువ. ఆయన మిగతా హీరోల్లా విదేశీ యాత్రలకు వెళ్లారు. పోనీ దేశంలోనూ టూర్లు చేయరు. ఎంతసేపు హైదరాబాద్ లోని ఫాంహౌస్ లో తోటల మధ్య వ్యవసాయం చేస్తారు. లేదంటే బుక్స్ చదువుతారు. అంతేతప్పా భార్యపిల్లలతో కలిసి ఎంజాయ్ చేసిన దాఖలాలు లేవు. ప్రజాసేవ కోసం తపిస్తారు. ఇప్పుడు విశాఖ బీచ్ లోనూ సేద తీరుతూనే మత్స్యకారుల సమస్యలు తెలుసుకోవడం గమనార్హం.
Video of #Pawankalyan From RK Beach.pic.twitter.com/dVYtEn0ufy
— AJITH PSPK Fans (@AjithPSPK_fans) November 12, 2022