Pawan Kalyan Janasena Party : జనసేన, పవన్ కళ్యాణ్ కొన్ని సందర్భాల్లో స్వతంత్రంగా ఉండటమే కాదు.. స్వతంత్రంగా ఉన్నట్టు భావించాలి. ప్రజాజీవితంలో ఉన్నప్పుడు ఇది చాలా అవసరం. కందుకూరు, గుంటూరు సంఘటనల విషయంలో చంద్రబాబు చేసింది బాధ్యతారాహిత్య ప్రవర్తన. జగన్ సర్కార్ దీన్ని టార్గెట్ చేసి అవకాశంగా తీసుకొని చంద్రబాబును టార్గెట్ చేసింది.
జగన్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో విఫలమైంది. పోలీసులు కూడా నిర్లప్తం ప్రవర్తించారు. అయితే కందుకూరు ఘటన జరిగిన తర్వాత కూడా చంద్రబాబులో ఆ మార్పు రాకపోవడమే ఇక్కడ అందరి చేత విమర్శలకు కారణం అవుతోంది.
జనసేన పార్టీ జగన్ యొక్క బాధ్యతారాహిత్య వైఖరిని ఖండించింది. దీన్ని స్వాగతించాల్సిందే. దాంతోపాటు చంద్రబాబు వైఖరిలో మార్పు రానందుకు జనసేన కూడా ప్రశ్నించి ఉండాల్సింది. ఎందుకంటే వెంటనే మరణించిన వారు ముందే ఉన్నా కావలి, గుంటూరులో సభలు నిర్వహించి మరింత మంది ప్రాణాలు తీశాడు. ఇవన్నీ చంద్రబాబు బాధ్యతారాహిత్య ధోరణినే.
ఇలాంటి విషయంలో పవన్ కళ్యాణ్ ది సూత్రబద్ధ, స్వతంత్ర వైఖరిగా ఉండాలి. జగన్ పైనే కాదు.. చంద్రబాబు విషయంలో పవన్ నిక్కచ్చిగా ఉండాలి. జనసేన వైఖరి ఎలా ఉండాలన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడాలి.