Ek Number News : తెలుగు రాష్ట్రాలే కాదు.. జాతీయం, అంతర్జాతీయ స్థాయిలో ‘ఏక్ నంబర్’ న్యూస్ ను మీ ముందుకు పట్టుకువచ్చాం. ఈరోజు కొందరు నేతలు సరదాగా వ్యవహరిస్తే.. మరికొందరు కామెడీ పండించారు. ఇంకొందరు ఎమోషనల్ గా స్పందించారు. అలాంటి వార్తలన్నీ కలగలిపి ఈరోజు ఓకే తెలుగు మీ ముందుకు తీసుకువస్తోంది.
https://www.youtube.com/watch?v=vJbXoOSVXdI
మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ లు కలిసి పాలకొల్లులో సందడి చేశారు. జనాల అవస్థలు తెలుసుకున్నారు. ఓ రోడ్డు పక్కన ఉన్న హోటల్ లో ఛాయ్ తాగారు. మంత్రులు వచ్చారని ఫొటోలు దిగాలని జనం ఎగబడడంతో ఆ మంత్రులిద్దరూ ఫొటోలు దిగారు. ఒక చిన్న హోటల్ కు వచ్చి చాయ్ తాగి సందడి చేసిన వీరి సింప్లిసిటీకి అందరూ ఫిదా అయ్యారు.
వైసీపీలో అసమ్మతి రేగింది. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పది మంది పోరంబోకులను వెంటేసుకుని తిరిగే రాజకీయాలు చేయలేకపోతున్నా.. పోరంబోకుల్లా మనం ప్రవర్తిస్తేనే ఇప్పటి రాజకీయాల్లో నిలబడగలం రాజకీయాల్లో పెద్దరికం పనికిరాదు.. అందుకే పాతతరం నాయకుడిగా మిగిలిపోయా..మా నన్న వసంత నాగేశ్వరరావు కాలం నాటి రాజకీయాలు ఇప్పుడు లేవు.. ప్రతిపక్షాలపై నేను తప్పుడు కేసులు బనాయించను. అందుకే పార్టీలో కొందరికి నాపై అసంతృప్తి ’ అంటూ ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ క్లారిటీ ఇచ్చారు.