Pawan Kalyan On Unstoppable 2: డిజిటల్ మీడియా లో ప్రభంజనం సృష్టించిన టాక్ షో ఏది అంటే మన అందరికి టక్కుమని గుర్తుకు వచ్చే పేరు ‘అన్ స్టాపబుల్ విత్ NBK’..టాలీవుడ్ కి చెందిన సీనియర్ హీరోలు , స్టార్ హీరోలు, డైరెక్టర్లు మరియు హీరోయిన్లు ఇలా అన్ని క్రాఫ్ట్స్ కి సంబంధించిన వారు ముఖ్య అతిథులుగా వచ్చే వారితో బాలయ్య బాబు సరదాగా చేసే చిట్ చాట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ టాక్ షో ద్వారానే యూత్ ఆడియన్స్ కి బాలయ్య బాబు బాగా దగ్గరయ్యాడు.,ఎప్పుడూ సీరియస్ గా ఉండే బాలయ్య బాబు లో ఇంత ఫన్ యాంగిల్ ఉంటుందా అని అందరూ ఆశ్చర్యపొయ్యేలా చేసింది ఈ బిగ్గెస్ట్ టాక్ షో..అఖండ సినిమా బాలయ్య కెరీర్ కి ఎంత ఉపయోగపడిందో చెప్పలేము కానీ, అన్ స్టాపబుల్ షో మాత్రం ఆయన కెరీర్ లో ఒక మైలు రాయిగా నిలిచిపోయింది..ఇక ఈ సీజన్ లో టాలీవుడ్ కి చెందిన స్టార్ హీరోలందరూ పాల్గొన్నారు.
ఈ సీజన్ లో కొద్దీ రోజుల క్రితం ప్రభాస్ తో షూట్ చేసిన ఎపిసోడ్ ని రెండు భాగాలుగా విభజించి అప్లోడ్ చేసిన సంగతి తెలిసిందే..కొద్దీ రోజుల క్రితమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా ఒక ఎపిసోడ్ ని షూట్ చేసారు..ఈ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా టెలికాస్ట్ అవుతుందని అందరూ అనుకున్నారు..కానీ ఫిబ్రవరి వరకు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ లేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి..ఈ ఎపిసోడ్ తో రెండవ సీజన్ ముగుస్తుందట..అందుకే తొందరగా కాకుండా కాస్త లేట్ గా విడుదల చెయ్యాలనే ఆలోచనలో ఆహా మీడియా ఉన్నట్టు తెలుస్తుంది.

నిన్ననే ‘వీర సింహా రెడ్డి ‘ టీం తో ఒక ఎపిసోడ్ ని షూట్ చేశారు..సంక్రాంతి కానుకగా ఈ వారం లోనే ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది..ఈ ఎపిసోడ్ తర్వాత రామ్ చరణ్ – KTR తో మరో ఎపిసోడ్ ఉంటుందట..ఈ ఎపిసోడ్ కూడా పూర్తి అయిన తర్వాతే చివరి ఎపిసోడ్ గా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని స్ట్రీమింగ్ చెయ్యబోతున్నట్టు సమాచారం..దీనితో ఎప్పుడెప్పుడా అని ఈ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశే ఎదురైంది.