https://oktelugu.com/

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రకటన పొత్తుకు మాత్రమే, ముఖ్యమంత్రిపై కాదు

పవన్ కళ్యాణ్ ప్రకటన పొత్తుకు మాత్రమే, ముఖ్యమంత్రిపై కాదు.. దీనిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : September 15, 2023 / 06:03 PM IST
    Follow us on

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైలుముందు పత్రికా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు చంద్రబాబుకు నా సంపూర్ణ మద్దతు తెలుపుతానని అనుకున్నారు. కలిసికట్టుగా మేం పోటీ చేయబోతున్నాం.. తెలుగుదేశంతో మేం పొత్తు పెట్టుకుంటున్నామని ప్రకటించారు. ఇది ఎవరూ ఊహించలేదు. ఎందుకని..

    పవన్ కళ్యాణ్ ఎందుకిలా చేశాడని అందరూ ఆలోచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇవ్వాలే కాదు.. ఇప్పటం సభ నుంచే వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని ఆశయం పెట్టుకున్నారు. ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో మాట్లాడినా.. వైజాగ్ లో మోడీతో మాట్లాడినా..పవన్ లక్ష్యం ఒక్కటే.. వైసీపీ విముక్త ఏపీ కోసం ఆది నుంచి పోరాడుతున్నాడు.

    బీజేపీ పెద్దలు కూడా పవన్ చెప్పినదాన్ని వ్యతిరేకించలేదు. సానూకూలంగా స్పందించలేదు. అది పెద్ద పార్టీ సమయం వచ్చినప్పుడు దీని గురించి మాట్లాడుతామని చెప్పారు. బీజేపీకి ఉండే కారణాలు వారికి ఉంటాయి. దేశానికి సంబంధించిన ఇష్యూల విషయంలో బీజేపీ కొంచెం ముందూ వెనుకా ఆలోచిస్తోంది.

    పవన్ కళ్యాణ్ ప్రకటన పొత్తుకు మాత్రమే, ముఖ్యమంత్రిపై కాదు.. దీనిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.