Analysis on Narayana Arrest : నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణ అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. పదో తరగతి పరీక్షా పేపర్ల లీకేజీ వ్యవహారంలో దోషులను ఖచ్చితంగా పట్టుకోవాల్సిందే. వ్యవస్థాగత లోపాలను సరిదిద్దాలి. కానీ నారాయణ అరెస్ట్ కు పోలీసులు చెప్పిన కారణాలు అంత సహేతుకంగా లేవు.

ఏడుగురిని ఇందులో అరెస్ట్ చేయగా.. అందులో ఇద్దరు నారాయణ విద్యాసంస్థలకు చెందిన వారు. మొత్తం 60 మందిని అరెస్ట్ చేస్తే అందులో 30 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు కావడం గమనార్హం. ప్రభుత్వం నుంచి కూడా 30 మంది ఉండడంతో విద్యాశాఖ మంత్రి బొత్స కూడా బాధ్యుడేనా? అన్న సందేహాలు వినిపిస్తున్నాయి.
ఈ విషయంలో పోలీస్ వ్యవస్థ తీరు చూస్తే స్వతంత్రంగా లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు రాజకీయ ఒత్తిడులకు లొంగడం లేదని ప్రజలకు తెలియాలి. ఇక పోలీసులు ‘నారాయణ’ తన విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లతో టార్గెట్లు పెట్టాడని.. మనమే నంబర్ 1గా రావాలని చెప్పాడని.. ఈ క్రమంలోనే వాళ్లు పేపర్ లీక్ చేశారన్నది పోలీసుల మాట.. మరి ఈ విషయంలో నారాయణది తప్పు ఏంటన్నది ఇక్కడ విస్తుగొలుపుతోంది. నారాయణ నంబర్ 1 రావాలన్నది కాపీ కొట్టి కాదు.. చదివించి.. ఈ విషయంలో పోలీసుల తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది.
నారాయణ స్కూళ్లలోని వైస్ ప్రిన్సిపాల్ వాట్సాప్ లో పేపర్ లీక్ చేశాడని.. ఆయన చెప్పాడని నారాయణను అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. ఈ లీకేజీకి ఎలాంటి సంబంధం లేని నారాయణకు అందుకే వెంటనే బెయిల్ మంజూరు చేశారు. ఆధారాలు లేకుండా ఇలా చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నారాయణ అరెస్ట్ పై పూర్తి విశ్లేషణను రామ్ గారు కింది వీడియోలో అందిస్తారు..
[…] Also Read: Analysis on Narayana Arrest : నారాయణ అరెస్ట్ పై ఎన్నో అన… […]
[…] Also Read: Analysis on Narayana Arrest : నారాయణ అరెస్ట్ పై ఎన్నో అన… […]