Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అద్భుతంగా కొనసాగుతోంది. మధ్యలో ఆటంకాలు వస్తున్నా వెరవకుండా పవన్ ముందుకు సాగుతున్నారు. మధ్యలో ముద్రగడ లాంటి వారితో పవన్ ను టార్గెట్ చేయించినా.. కాపుల్లో ముద్రగడ పలుచన అయిపోయాడు తప్పితే పవన్ కళ్యాణ్ పై అభిమానం మాత్రం ప్రజల్లో తగ్గలేదు. పవన్ మంచికే జరిగింది.
తాజాగా పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రపై పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈనాడు ఇంటర్వ్యూ చాలా వివరణాత్మకంగా అద్భుతంగా ఉంది. కాకపోతే కొన్ని విషయాల్లో ఆత్మరక్షణ అవసరం లేదు. ముఖ్యమంత్రి పదవి విషయంలో పవన్ డిఫెన్స్ లో పడిపోతున్నారు. ఇటువంటి అప్పుడే పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమంత్రి పదవి విషయంలో పవన్ ఆత్మరక్షణలో పడొద్దు. జనసైనికులు, అభిమానులు కోరుకునేది ఇదే.
ప్రస్తుతం పార్లమెంటరీ సిస్టంలో ఏదైనా సాధ్యమే. 30 సీట్లు వచ్చిన కుమారస్వామి కర్ణాటక సీఎం కాలేదా? హెచ్.డీ దేవెగౌడ ప్రధానమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రికి 175 స్థానాల్లో పోటీచేస్తేనే అవకాశం అన్నది వాస్తవం కాదు. ఇది పవన్ గుర్తెరగాలి. ఛాన్స్ ఉండొచ్చు కదా.. ఎన్ని సీట్లు అయినా హంగ్ వస్తే పవన్ సీఎం కావచ్చు.
ఈ ఈనాడు ఇంటర్వ్యూలు, జర్నలిస్టులతో వ్యాఖ్యల విషయంలో పవన్ జాగ్రత్తగా ఉండాలి. పొత్తుల విషయంలో నర్మగర్భంగా మాట్లాడాల్సిన అసవరం ఎంతైనా ఉంది. వారాహి యాత్రలో పొత్తుల ప్రస్తావన తీసుకురాని పవన్ మీడియా ఇంటర్వ్యూలో ఈ మేరకు డిఫెన్స్ లో పడొద్దు..
ఆత్మ విశ్వాసం, తెగింపు తగ్గకుండానే పవన్ పయనం కొనసాగాలన్న దానిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..
