Tholiprema Re Release: టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పోకిరి సినిమాతో మొదలైవున్న ఈ ట్రెండ్ మొన్న నరసింహనాయుడు సినిమా వరకు కొనసాగింది, ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఎన్ని సినిమాలు విడుదల అయ్యినప్పటికీ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘ఖుషి’ చిత్రం రీ రిలీజ్ కలెక్షన్స్ ని మొదటి రోజు గాని, ఫుల్ రన్ లో కానీ అందుకోలేకపోతున్నాయి. భారీ హుంగామ తో విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి కూడా ఈ సినిమా రికార్డ్స్ కి దగ్గర్లో కూడా రాలేకపోయింది.
ఇక ఈ చిత్రం రికార్డ్స్ ని ఎవ్వరూ బ్రేక్ చెయ్యలేరా అని ట్రేడ్ వర్గాలు సైతం అనుకుంటున్న సమయం లో మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమానే ఆ చిత్రం రీ రికార్డ్స్ ని బద్దలు కొట్టడానికి సిద్ధం అయ్యింది. ఆయనని స్టార్ హీరో గా నిలబెట్టిన యూత్ ఫుల్ లవ్ స్టోరీ తొలిప్రేమ చిత్రం ఈ నెల 30 వ తారీఖున విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ చిత్రాన్ని శ్రీమాత క్రియేషన్స్ కొనుగోలు చేసి, 4K కి రీ మాస్టర్ చేయించి ఈ నెల 30 వ తారీఖున విడుదల చెయ్యాలని చూస్తున్నారు. అయితే ఈ సినిమాకి వచ్చే వసూళ్లు జనసేన పార్టీ కి వెళ్ళద్దు, మూడవ పార్టీ కి చెందిన సినిమా అవ్వడం తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇలాంటి వాళ్లకు లాభాలు ఇవ్వకండి, కేవలం జనసేన పార్టీ కి డొనేట్ చేస్తాము అంటేనే ఏ రీ రిలీజ్ ని అయినా ప్రోత్సహించండి అంటూ సోషల్ మీడియా లో ఒక ప్రకటన చేసారు.అయితే శ్రీమాత క్రియేషన్స్ వాళ్ళు మాత్రం,మేము ఈ చిత్రం రైట్స్ ని కొనుగోలు చేసి చాలా కాలం అయ్యింది.
గతం లో విడుదల చేద్దాం అనుకుంటే ఆపించేసారు, ఈసారి మాత్రం ఎవరు చెప్పిన మేము వినదల్చుకోలేదు అంటూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది శ్రీమార్థ క్రియేషన్స్,త్వరలోనే హైదరాబాద్ లో ఒక గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి , ట్రైలర్ ని కూడా విడుదల చేయబోతున్నారట. మరి ఈ సినిమా అయినా ఖుషి రికార్డ్స్ ని బద్దలు కొడుతుందో లేదో చూద్దాం.