Analysis on BJP Future: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? తెలంగాణలో బలమైన ప్రతిపక్షంగా ఎదుగుతున్న బీజేపీ 2023లో అధికారం దక్కించుకోగలదా? ఏపీలో ఉనికి లేని చోట తన ప్రాబల్యాన్ని చూపగలదా? తెలంగాణలో బలంగా.. ఏపీలో తీసికట్టుగా బీజేపీ ఎలా తయారైంది? బీజేపీ వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఎలా ఎదగబోతోందనే దానిపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. నిజానికి దక్షిణ భారత దేశంలో బీజేపీ బలం నామమాత్రమే. ఒక్క కర్ణాటకలో తప్పితే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిన చరిత్ర లేదు. తెలంగాణలో ఇటీవల బీజేపీ బలం పుంజుకుంది. కర్ణాటకలోనూ బీజేపీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిపోయింది. మరి బీజేపీ బలం పుంజుకోవాలంటే ఏం చేయాలన్నది బీజేపీ పెద్దలు యోచించాల్సిన అవసరం ఉంది.

2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ బలం పుంజుకుంది. ఉత్తర తెలంగాణలో తిరుగులేని విధంగా ఎంపీ స్థానాలు గెలిచి దక్షిణ తెలంగాణలో తేలిపోయింది. తెలంగాణలో ప్రతిపక్ష స్థానం కోసం బీజేపీ పోటీపడుతోంది. హుజూరాబాద్, దుబ్బాకలో గెలుపుతో తెలంగాణలో ఇక పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే పోటీ ఉండనుందని తేలింది. కాంగ్రెస్ రోజురోజుకు తీసికట్టుగా మారింది. బండి సంజయ్ ను ఇటీవల అరెస్ట్ తో బీజేపీకి కావాల్సినంత మైలేజ్ పెంచింది. బీజేపీ గ్రాఫ్ తెలంగాణలో పైపైకి ఎదుగుతోంది..
ఆంధ్రప్రదేశ్ లో అసలు బీజేపీ బలమే లేదు. టీడీపీ ఎంపీలను బీజేపీ తమలోకి లాగేసుకుంది. ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు, కేరళ, పంజాబ్ లలో కూడా అస్సలు బీజేపీకి ఉనికే లేదు. మోడీ హవా లేదు.
ఆంధ్రాలో ఎంత ప్రయత్నించినా బీజేపీ బలం పెరగడం లేదు. 2014లో మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయన ప్రత్యేక హోదా సహా ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఇక్కడి మీడియా, మేధావి వర్గం ఏపీ ప్రజల్లోకి చొప్పించారు. దీంతో మీడియా వల్ల బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఏపీలో పెరిగిపోయింది. 2024లోనూ బీజేపీ ఏపీలో అధికారంలోకి వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? బీజేపీ నేతలు ఏం చేయాలన్న దానిపై ‘రామ్’ టాక్ సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
