https://oktelugu.com/

Amitabh -Aishwarya : అభిషేక్ తో విబేధాలు, ఐశ్వర్యను అన్ ఫాలో చేసిన అమితాబ్… అసలు నిజం ఇదే!

. కాగా 2006లో ఐశ్వర్య రాయ్ ధూమ్ 2 చిత్రంలో నటించింది. ఆ మూవీ సెట్స్ లో అభిషేక్, ఐశ్యర్య రాయ్ మధ్య ప్రేమ చిగురించింది. 2007లో వీరు వివాహం చేసుకున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : December 12, 2023 6:19 pm
    Follow us on

    Amitabh -Aishwarya : సోషల్ మీడియా యుగంలో ఒక వార్త వాయువు కంటే వేగంగా ప్రపంచాన్ని చుట్టేస్తోంది. అది నిజమో అబద్దమో అని తెలిసేలోపు జనాలు ఓ అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా ఒక వార్త సంచలనం రేపింది. అదేమిటంటే… కోడలు ఐశ్వర్య బచ్చన్ రాయ్ బచ్చన్ ని అమితాబ్ బచ్చన్ ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో చేశారు. బచ్చన్ ఫ్యామిలీలో విబేధాలకు ఇదే సంకేతం. అభిషేక్ బచ్చన్ తో ఆమె విడాకులకు సిద్దమయ్యారంటూ వరుస కథనాలు పుట్టుకొచ్చాయి.

    అసలు నిజంగానే అమితాబ్ బచ్చన్ ఆమెను ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో చేశారా? ఈ ప్రచారంలో వాస్తవం ఎంత? అని పరిశీలిస్తే… అమితాబ్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ ని గతంలో ఫాలో అయ్యాడు అనడానికి ఆధారం లేదు. అమితాబ్ కేవలం 74 మందిని ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు. ఐశ్వర్య రాయ్ కుటుంబ సభ్యుల్లో తన భర్త అభిషేక్ బచ్చన్ ని మాత్రమే ఫాలో అవుతున్నారు.

    అసలు అమితాబ్ బచ్చన్ ఎప్పుడూ ఐశ్యర్య రాయ్ ని ఇంస్టాగ్రామ్ లో ఫాలో అయ్యింది లేదు. దీన్ని ఆసరాగా తీసుకుని అమితాబ్ ఒకప్పుడు ఫాలో అయ్యేవాడు, ఇప్పుడు అన్ ఫాలో చేశాడంటూ ఒక వాదన తెరపైకి తెచ్చారన్న మాట వినిపిస్తోంది. అలాగే అమితాబ్ ప్రైవసీ సెట్టింగ్స్ పెట్టుకున్నారు. ఆయన్నీ ఫాలో అయ్యేవాళ్లకు మాత్రమే ఆయన ఎవరిని ఫాలో అవుతున్నారో కనిపిస్తుంది. కాబట్టి ఐశ్వర్య రాయ్ ని అమితాబ్ ఇటీవల అన్ ఫాలో చేశాడన్న వార్తల్లో నిజం లేదని కొందరి వాదన.

    కొద్ది నెలలుగా అభిషేక్ బచ్చన్-ఐశ్వర్య మధ్య విబేధాలనే పుకార్లు ఉన్నాయి. ముఖేష్ అంబానీ కుటుంబం ఏర్పాటు చేసిన నీతూ ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ఓపెనింగ్ కి బాలీవుడ్ ప్రముఖులందరూ హాజరయ్యారు. ఐశ్యర్య రాయ్ కూతురు ఆరాధ్యతో పాటు వచ్చారు. అభిషేక్ బచ్చన్ లేకుండా ఐశ్యర్య ఈ మెగా ఈవెంట్ కి హాజరు కావడంతో ఊహాగానాలు మొదలయ్యాయి.

    అమితాబ్ కుటుంబంపై వరుస పుకార్లు హల్చల్ చేస్తున్నా… ఎవరూ నోరు మెదపలేదు. తాజా ఉదంతం మీద కూడా అమితాబ్, ఐశ్వర్య రాయ్ స్పందించలేదు. అమితాబ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. కనీసం పరోక్షంగా ఖండించలేదు. కాగా 2006లో ఐశ్వర్య రాయ్ ధూమ్ 2 చిత్రంలో నటించింది. ఆ మూవీ సెట్స్ లో అభిషేక్, ఐశ్యర్య రాయ్ మధ్య ప్రేమ చిగురించింది. 2007లో వీరు వివాహం చేసుకున్నారు.