Raayan Trailer: స్టార్ హీరో దర్శకుడు అవుతున్నాడు.. ‘రాయన్ ‘ సినిమాతో సత్తా చాటుకుంటాడా..?

ఇప్పటి వరకు హీరోగా సక్సెస్ సాధించిన ఆయన దర్శకుడిగా కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. కాబట్టి ఈ సినిమా విషయంలో ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అయితే ట్రైలర్ మొదట్లో ఒక భారీ ఎలివేషన్ డైలాగ్ తో ట్రైలర్ ని స్టార్ట్ చేశారు.

Written By: Gopi, Updated On : July 17, 2024 11:17 am

Raayan Trailer

Follow us on

Raayan Trailer: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు ధనుష్…ఆయన కెరియర్ మొదట్లో వైవిధ్యభరితమైన కథాంశాలను ఎంచుకొని నటుడిగా మంచి పేరు సంపాదించుకోవడమే కాకుండా ఉత్తమ నటుడిగా ఎన్నో అవార్డులను కూడా అందుకున్నాడు. అలాంటి నటుడు తన 50వ సినిమాగా ‘రాయన్ ‘ అనే సినిమాను చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ధనుష్ హీరోగా చేస్తూనే, దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా మీద ధనుష్ చాలా కేర్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది.

ఎందుకంటే అటు హీరోగా, ఇటు దర్శకుడిగా ఏక కాలం లో రెండు బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి సమయంలో ఆయన ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా కేర్ ఫుల్ గా చూసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు హీరోగా సక్సెస్ సాధించిన ఆయన దర్శకుడిగా కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. కాబట్టి ఈ సినిమా విషయంలో ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అయితే ట్రైలర్ మొదట్లో ఒక భారీ ఎలివేషన్ డైలాగ్ తో ట్రైలర్ ని స్టార్ట్ చేశారు. ఇక ధనుష్ ఎంట్రీ తో ట్రైలర్ అనేది పీక్స్ లెవెల్లోకి వెళ్లిపోయింది. నిజంగా ట్రైలర్ చాలా అద్భుతంగా కట్ చేశారు.

మరి ఈ సినిమాలో కూడా ఇలాంటి ఎలివేషన్ సీన్స్ ఇంకా ఉంటాయా వాటిలో ధనుష్ ఎలా పర్ఫార్మ్ చేశాడు. అలాగే వాటిని స్క్రీన్ మీద ఒక డైరెక్టర్ గా ఎలా ప్రజెంట్ చేశాడు. అనే విషయాలు ఇప్పుడు తెలుగు, తమిళ్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకిత్తిస్తున్నాయి. ఇక మొదటిసారి డైరెక్షన్ చేస్తున్న ధనుష్ ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటాడా? లేదంటే ప్లాప్ ను మూటగట్టుకొని చతికల పడుతాడా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. నటుడిగా మాత్రం తన విషయంలో ఎలాంటి వంక పెట్టాల్సిన పనిలేదు. ఇంకా దర్శకుడిగా ఇప్పుడు కొత్త బాధ్యతను ఎంచుకున్నాడు. కాబట్టి దాన్ని సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తాడా లేదా అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది… ఈ సినిమాతో ఆయన తెలుగులో కనక భారీ సక్సెస్ ని అందుకుంటే తన మార్కెట్ అనేది భారీగా విస్తరిస్తుందనే చెప్పాలి.

మరి అలా కాకుండా ఒకవేళ ప్లాపును మూటగట్టుకుంటే మాత్రం ధనుష్ మార్కెట్ మరింత డౌన్ అయిపోతుంది. ఇక ‘సార్ ‘ సినిమాతో మంచి మార్కెట్ కి క్రియేట్ చేసుకున్న ఆయన మధ్యలో వచ్చిన ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా ఏ మాత్రం ప్రభావం చూపించకపోవడంతో మరోసారి ఢీలా పడ్డాడు. మరి ఇప్పటికైనా ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ట్రైలర్ పరంగా చూసుకుంటే మాత్రం ఈ మూవీలో ధనుష్ ఒక డిఫరెంట్ గెటప్ లో కనిపించారు. అలాగే ఆయన తన వాళ్ల కోసం ముందుండి పోరాడుతూ వాళ్లను కాపాడుకునే ఒక క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు అనేది ట్రైలర్లో ఎస్టాబ్లిష్ చేశారు.

మరి సినిమా మొత్తం ఇదే క్యారెక్టర్ లో ఇదే టెంపో లో తీసుకెళ్తారా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది… మొత్తానికి అయితే ధనుష్ ఒక డిఫరెంట్ రోల్ లో ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ సినిమా సక్సెస్ అవుతుందా? ఫెయిల్యూర్ అవుతుందా? అనే విషయం పక్కన పెడితే హీరో గా, డైరెక్టర్ చేస్తున్న ఆయన ప్రయత్నం మాత్రం చాలా గొప్పగా ఉందని చాలామంది సినీ ప్రముఖులు సైతం అతన్ని ప్రశంసిస్తున్నారు. ఇక ఈ సినిమా ఈ నెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కాబట్టి సక్సెస్ అయితే దర్శకుడిగా ధనుష్ సక్సెస్ అవుతాడు లేదంటే మాత్రం దర్శకుడిగా ఒక అటెంప్ట్ చేశాడని పేరు సంపాదించుకుంటాడు.