Varun Tej-Lavanya : వరుణ్ తేజ్-లావణ్యలకు షేకింగ్ పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్.. బిగ్ సర్ప్రైజ్ ఫొటోలు వైరల్

ఈ పార్టీకి చిరంజీవితో పాటు కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు. అల్లు అర్జున్ ఇచ్చిన విందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Written By: NARESH, Updated On : October 17, 2023 9:30 pm
Follow us on

Varun Tej-Lavanya : టాలీవుడ్ లో హీరోయిన్స్ ని పెళ్లాడే హీరోల సంఖ్య తక్కువే. దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రలో 20 జంటలు కూడా లేవు. బాలీవుడ్ మాత్రం హీరోలు హీరోయిన్స్ చక్కగా పెళ్లిళ్లు చేసుకుంటారు. ఈ జనరేషన్ హీరోల్లో నాగ చైతన్య సమంతను పెళ్లాడాడు. మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ తర్వాత మరో మెగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లాడుతున్నాడు. వీరి పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవంబర్ 1న ఇటలీ దేశంలో ఘనంగా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు.

వరుణ్-లావణ్యల వివాహానికి కుటుంబ సభ్యులకు మాత్రమే ఆహ్వానం ఉంది. పెళ్లి అనంతరం హైదరాబాద్ లో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారట. ఆ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇక పెళ్ళికి మరో రెండు వారాల సమయం ఉండగానే మెగా ఫ్యామిలీలో వేడుకలు మొదలయ్యాయి. కాబోయే దంపతులకు ప్రీ వెడ్డింగ్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి ఓ ప్రీ వెడ్డింగ్ పార్టీ నిర్వహించాడు. మెగా హీరోలు కుటుంబ సభ్యులు ఈ పార్టీకి హాజరయ్యారు.

అనుకోని కారణాలతో అల్లు అర్జున్, భార్య స్నేహారెడ్డి హాజరు కాలేదు. దీంతో అల్లు అర్జున్ దంపతులు వరుణ్-లావణ్యల కోసం మరో పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి చిరంజీవితో పాటు కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు. అల్లు అర్జున్ ఇచ్చిన విందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వరుణ్ తేజ్ గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసిన అల్లు అర్జున్-స్నేహారెడ్డిలకు కృతఙ్ఞతలు తెలిపాడు. వరుణ్ తేజ్ ట్వీట్ ఆసక్తి రేపింది.

ఇక మిస్టర్ మూవీ కోసం మొదట వరుణ్-లావణ్య కలిశారు. తర్వాత అంతరిక్షం చిత్రంలో జతకట్టారు. లవ్ యట్ ఫస్ట్ సైట్ అన్నట్లు మొదటి చూపులోనే ఇద్దరూ ప్రేమలో పడిపోయారట. వీరి ప్రేమ వ్యవహారం చాలా కాలం గోప్యంగా ఉంది. రెండేళ్లుగా పుకార్లు చెలరేగాయి. అప్పుడు కూడా వార్తలను ఖండించడం విశేషం. ఏకంగా నిశ్చితార్థం ప్రకటించి షాక్ ఇచ్చారు. జూన్ 9న హైదరాబాద్ లో లావణ్య-వరుణ్ ల ఎంగేజ్మెంట్ జరిగింది.