Tollywood Film Industry: ఈ లోకం చాలా చిన్నది చిట్టి’ అన్నది ‘రోబో’లోని ఫేమస్ డైలాగ్. ట్రెండ్ ను ఫాలో అయ్యి భవిష్యత్తును ఊహించి తీశారు కాబట్టి అది బాగా హిట్అయ్యింది. ప్రపంచమంతా ఇప్పుడు ముందుకు దూసుకెళుతోంది. మనం చూసిన చరిత్ర.. వర్ధమాన పరిస్థితులను బట్టి సినమాలు తీస్తే అస్సలు ఆడడం లేదు. సమ్ థింగ్ న్యూ.. కొత్తగా ఉండాలి. ప్రేక్షకుడి ఊహకు అందని విధంగా తీయాలి. హాలీవుడ్ అదే చేస్తోంది.ఏకంగా భూగ్రహం మీద సినిమాలు వదిలేసి వేరే గ్రహాల మీద, అవెంజర్స్ వంటి అతీంద్రియ శక్తులు గల వారి మీద సినిమాలొస్తున్నాయి. ‘అవతార్’, అవేంజర్స్ సిరీస్ లు అలాంటివే.

కానీ మన తెలుగు సినిమా మాత్రం వెనక్కి వెళుతోంది. చరిత్రలో తవ్వకాలు జరుపుతోంది. బాహుబలి లాంటి రాజుల కథ తెరపైకి వచ్చింది. ఇక ఆ తర్వాత ‘సైరా’ అంటూ స్వాతంత్ర్య సమరయోధుడి ధీరత్వం కనిపించింది. మగధీరలో ఒకప్పటి రాచరికపు వాసనలు కనిపించాయి. ఇప్పుడు బింబిసారలోనూ అదే పాత చరిత్ర కథ.
Also Read: Pokri Re-Release Bookings: పోకిరి రీ – రిలీజ్.. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఎంత వసూలు చేసిందో తెలుసా?
అమెరికా వంటి ముందుకు పోతున్న దేశాలు భవిష్యత్తుని కలగంటూ సినిమాలు తీస్తున్నాయి. మన దేశంలోనూ ముందుకు పోవాలనుకునే కేరళ, తమిళనాట భవిష్యత్తు కోసం కాకపోయినా కనీసం వర్తమానాన్ని విశ్లేషించుకుని, అర్థంచేసుకుని తప్పుల్ని సరిదిద్దుకోవడానికి సినిమాలు తీస్తున్నారు.
ఒకప్పుడు అభ్యదయాన ముందు నడిచిన తెలుగులో మాత్రం భవిష్యత్తు మాట అటుంచి, వర్తమానం నుండి కూడా పారిపోయి గతంలోకి వెళ్లి అక్కడ మిగిలిన బానిసత్వాలకీ, మారణహోమాలకీ, మూర్ఖత్వాలకీ సరికొత్త తమ పైత్యం అద్ది బాహుబలి, సైరా, మగధీర, బింబిసార, అతిసార అంటూ ముందుకు తెస్తున్నారు.

పాలకులకి కావాల్సింది ఇవే కాబట్టి ఈ కథలు రాసే రచయితలకు, దర్శకులకు పద్మశ్రీలు కట్టబెట్టి ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే టాకీసులు మూతపడిన ఈ సినిమా పరిశ్రమ ఎప్పుడు పూర్తిగా నాశనమవుతుందో చెప్పలేని పరిస్థితి. అప్పుడు గానీ జాతి తన, తన చుట్టూరా అల్లిన మాయపొరని చీల్చుకోలేదంటే అతిశయోక్తి కాదు.
