https://oktelugu.com/

Pokiri Re-Release Bookings: పోకిరి రీ – రిలీజ్.. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఎంత వసూలు చేసిందో తెలుసా?

Pokiri Re-Release Bookings: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన పోకిరి సినిమా ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే..ఆరోజుల్లోనే ఈ సినిమా 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసి సౌత్ లోనే పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..మాములు స్టార్ హీరో గా ఉన్న మహేష్ బాబు ని సూపర్ స్టార్ గా చేసింది ఈ సినిమానే..మాస్ సినిమాలలో సరికొత్త ట్రెండ్ ని సృష్టించిన […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 8, 2022 / 11:19 AM IST

    Pokiri Re-Release Bookings

    Follow us on

    Pokiri Re-Release Bookings: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన పోకిరి సినిమా ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే..ఆరోజుల్లోనే ఈ సినిమా 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసి సౌత్ లోనే పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..మాములు స్టార్ హీరో గా ఉన్న మహేష్ బాబు ని సూపర్ స్టార్ గా చేసింది ఈ సినిమానే..మాస్ సినిమాలలో సరికొత్త ట్రెండ్ ని సృష్టించిన ఈ సినిమా క్రేజ్ ఇప్పటికి కూడా తగ్గలేదు అనే చెప్పాలి..ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా మరోసారి విడుదల కానుంది..ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ప్రాంతాలలో ప్రారంభం అయిపోయాయి..మహేష్ బాబు కొత్త సినిమాకి ఎంత క్రేజ్ అయితే ఉంటుందో..పోకిరి సినిమా టికెట్స్ కి అదే రేంజ్ క్రేజ్ ఉంది అని చెప్పడం ఎలాంటి అతిశయోక్తి లేదు.

    Pokri

    Also Read: Chandrababu Naidu Delhi Tour: కేంద్ర పెద్దలతో చంద్రబాబును కలిపిందెవరు? రాయభారం నడిపిందెవరు?

    ముఖ్యంగా హైదరాబాద్ మరియు ఓవర్సీస్ లో ఎన్ని షోస్ వేసిన కూడా నిమిషాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఫుల్స్ అయిపోతున్నాయి..చాలా మంది హీరోలకు కొత్త సినిమాలకు కూడా ఈ రేంజ్ క్రేజ్ లేదు..హైదరాబాద్ లో ఇప్పటికే ఈ సినిమాకి 30 షోలు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసారు..ఈ 30 షోస్ కి గాను ఒక్క టికెట్ కూడా దొరకకపోవడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం..ప్రస్తుతం థియేటర్స్ లో భింబిసారా మరియు సీతారామం వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు మంచి వసూళ్లను రాబడుతూ దూసుకుపోతున్నాయి..ఇలాంటి సమయం లో థియేటర్స్ దొరకడం చాలా కష్టం..కానీ పోకిరి సినిమాకి హైదరాబాద్ లో ప్రసాద్ మల్టీప్లెక్స్ లోనే 8 షోస్ ఇచ్చారంటే మహేష్ బాబు క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు..ఈ సినిమా టికెట్స్ కి ఉన్న డిమాండ్ చూస్తుంటే మరికొన్ని షోస్ కూడా యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది..కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ సినిమా కోటి రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..ఇది అనితర సాధ్యం..సెప్టెంబర్ 2 వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు..ఆ రోజు పోకిరి సినిమాలాగానే జల్సా సినిమా ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేస్తున్నారు..ఈ సినిమా పోకిరి సృష్టించిన ఈ అరుదైన రికార్డు ని బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.

    Mahesh Babu

    Also Read: Rajagopal Reddy: మునుగోడులో పోటీకి దూరంగా రాజగోపాల్ రెడ్డి?


    Tags