Nandamuri Balakrishna Fires On Dil Raju: కరోనా మహమ్మారి తర్వాత OTT లకు బాగా అలవాటు పడిన ప్రేక్షకులు ఇప్పుడు థియేటర్స్ కి వచ్చి సినిమాలు చూడడం మానేశారంటూ..కలెక్షన్స్ రావట్లేదు అంటూ నిర్మాతలు ఇటీవల కాలం లో తెగ హంగామా చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..కానీ ఇటీవలే విడుదలైన ‘భింబిసారా’ , ‘సీతారామం’ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి, కాసుల కనకవర్షం కురిపించి ఇండస్ట్రీ కి కొత్త ఊపిరి తీసుకొని రావడం మన అందరం చూసాము..దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే..ఆడియన్స్ లో ఎలాంటి లోపం లేదు..మంచి సినిమా ఇస్తే నెత్తిన పెట్టుకొని నీరాజనాలు పలుకుతున్నారు..కానీ కంటెంట్ కాస్త తేడా గా ఇస్తే ఇంతకుముందు కనీసం ఓపెనింగ్స్ అయినా ఇచ్చేవారు..ఇప్పుడు అది కూడా కట్ చేస్తున్నారు..కాబట్టి ఆడియన్స్ కి మంచి కంటెంట్ ఇవ్వడం పైన మాత్రమే ద్రుష్టి పెట్టాలి కానీ షూటింగ్స్ ఆపేయడం వల్ల ఇండస్ట్రీ కి ఏమి ఒరగదు నష్టం తప్ప అని పలువురు హీరోలు ప్రొడ్యూసర్స్ గిల్డ్ పై విరుచుకుపడుతున్నారు.
Also Read: Pokri Re-Release Bookings: పోకిరి రీ – రిలీజ్.. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఎంత వసూలు చేసిందో తెలుసా?
ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ అయితే తన నిర్మాతలపై ఫైర్ అయ్యాడు..వెంటనే షూటింగ్ ప్రారంభించండి బంద్ లేదు బొక్కా లేదు అంటూ విరుచుకుపడ్డాడట..అంతే కాకుండా నిర్మాత దిల్ రాజు కి ప్రత్యేకంగా ఫోన్ చేసి ఏమిటి ఇది అంతా..షూటింగ్స్ అరిపివేయడం మూర్కపు చర్య..షూటింగ్స్ చేసుకుంటూ మీ చర్చలు సమాంతరంగా చేసుకోలేరా అంటూ మందలించినట్టు తెలుస్తుంది..మరో పక్క హీరో నాని..మరియు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు టీం కూడా ప్రొడ్యూసర్ గిల్డ్ పై ఆగ్రహం తో ఉన్నారట..దీనితో చేసేది ఏమి లేక షూటింగ్స్ చెయ్యాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు అంటూ ప్రొడ్యూసర్ గిల్డ్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది..ఈ వారం లోనే బడ్జెట్ కి సంబంధించి కొత్త నిబంధనలు..మరియు ప్రొడక్షన్ వెస్టీజి గురించి కూడా సరికొత్త రూల్స్ ని ఒక కొలిక్కి తెచ్చి మిగిలిన సినిమాల షూటింగ్స్ అన్నీ కూడా ప్రారంభం అయ్యేలా చేస్తారని తెలుస్తుంది..ఎందుకంటే దసరా కి మరియు సంక్రాంతికి విడుదల అవ్వాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి..అందుకే షూటింగ్స్ అర్జంటుగా ప్రారంభించాల్సిన అవసరం ఉంది..మరో పక్క ఈ బంద్ వల్ల హీరోలు మరియు ఆర్టిస్టుల డేట్స్ కి కూడా ఇబ్బందులు ఉన్నాయి.
Also Read: Hero Nani: హీరో నానికి తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. శోకసంద్రంలో ఫ్యాన్స్