https://oktelugu.com/

మందుబాబులకు కిక్కెక్కించే వార్త.. ఇకపై ఆన్ లైన్ లో మద్యం..?

మారుతున్న కాలంతో పాటే ఆన్ లైన్ డెలివరీలకు ప్రాధాన్యత పెరుగుతోంది. నగరాల నుంచి పల్లెల వరకు అందరూ ఆన్ లైన్ డెలివరీపైనే ఆధారపడుతున్నారు. నచ్చిన ఆహారం తినాలన్నా ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకుంటే క్షణాల్లో ఇంటికి చేరుతుంది. అయితే మద్యం మాత్రం ఇప్పటివరకు ఆఫ్ లైన్ లో మాత్రమే ఉంది. మద్యపానాన్ని ఇష్టపడేవాళ్లు మద్యాన్ని కూడా ఆన్ లైన్ లోకి అందుబాటులోకి తెస్తే బాగుంటుందని పలు సందర్భాల్లో చెబుతూ ఉంటారు. Also Read : తండ్రిని […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 24, 2020 / 07:22 PM IST
    Follow us on

    మారుతున్న కాలంతో పాటే ఆన్ లైన్ డెలివరీలకు ప్రాధాన్యత పెరుగుతోంది. నగరాల నుంచి పల్లెల వరకు అందరూ ఆన్ లైన్ డెలివరీపైనే ఆధారపడుతున్నారు. నచ్చిన ఆహారం తినాలన్నా ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకుంటే క్షణాల్లో ఇంటికి చేరుతుంది. అయితే మద్యం మాత్రం ఇప్పటివరకు ఆఫ్ లైన్ లో మాత్రమే ఉంది. మద్యపానాన్ని ఇష్టపడేవాళ్లు మద్యాన్ని కూడా ఆన్ లైన్ లోకి అందుబాటులోకి తెస్తే బాగుంటుందని పలు సందర్భాల్లో చెబుతూ ఉంటారు.

    Also Read : తండ్రిని చంపిన వ్యక్తి కోసం 17 ఏళ్లుగా వెతుకుతున్న కొడుకు.. చివరకు..?

    అయితే ఎట్టకేలకు మద్యం ప్రియుల కోరిక నెరవేరనుంది. హైదరాబాద్ వాసులకు ఆన్ లైన్ లో మద్యం అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ కు చెందిన ఒక స్టార్టప్ ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఆన్ లైన్ సోషల్ డ్రింకింగ్ ఫ్లాట్ ఫామ్ ను తమ సంస్థ ప్రారంభించబోతుందని వెల్లడించింది. దీంతో మద్యం ప్రియులు ఇంట్లో కూర్చుని నచ్చిన బ్రాండ్ ను ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. బూజీ (boozie) పేరుతో ప్రారంభమైన కొత్త స్టార్టప్ ద్వారా మద్యాన్ని సులభంగా ఆర్డర్ చేయవచ్చు.

    బూజీ సంస్థ ఇందుకోసం వెబ్ సైట్ తో పాటు యాప్ ను కూడా అందుబాటులో ఉంచనుందని తెలుస్తోంది. దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా మద్యం పాలసీలు ఉన్నాయి. ఒక రాష్ట్రంలో దొరికే మద్యం బ్రాండ్లు మరో రాష్ట్రంలో సులభంగా దొరకవు. అయితే బూజీ సంస్థ తమ వెబ్ సైట్ ద్వారా ప్రత్యేక బ్రాండ్లను కొనుగోలు చేయవచ్చని చెబుతోంది. దీంతో మద్యం ప్రియులు కొత్త రుచులను సైతం అస్వాదించవచ్చు.

    బూజీ సంస్థ ప్రతినిధులు మొదట హైదరాబాద్ లో మద్యం ఆన్ లైన్ లో అందుబాటులోకి తెస్తామని ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా మద్యం అందుబాటులోకి తెచ్చే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. యాప్ లో లేదా వెబ్ సైట్ లో బుక్ చేసుకున్న వారికి సమీపంలో ఉన్న వైన్ షాప్ నుంచి మద్యం డెలివరీ అయ్యేలా బ్రూజీ సంస్థ చేస్తుంది. ఫ్రీగా మద్యం డెలివరీ చేయనున్నామని ఈ సంస్థ చెబుతోంది.

    Also Read : తల్లిదండ్రులను బిచ్చగాళ్లను చేసిన కొడుకు… మనిషేనా అంటున్న నెటిజన్లు..?