Annamalai vs AIADMK : కొంతమంది తమ తల మీద తామే భస్మాసుర హస్తాన్ని పెట్టుకుంటారు. ఈ కోవలోకి ఈరోజు అన్నాడీఎంకే చేరిందని అనిపిస్తుంది. ఎవరి మీద కోపంతో అన్నాడీఎంకే ఇలా ప్రవర్తిస్తోందో అర్థం కావడం లేదు. చరిష్మా ఉన్నా పార్టీ ఇదీ.. ఎంజీఆర్, జయలలితలు ఏ నిర్ణయం తీసుకున్నా గుడ్డిగా ఫాలో అయ్యేవాళ్లు.. కానీ ఇప్పుడు అన్నాడీఎంకేలో అలాంటి చరిష్మా ఉన్న నాయకుడు లేడు. ప్రజల్లో మంచి పాపులారిటీ ఉన్న నేత లేరు. ఫళనిస్వామి, పన్నీర్ సెల్వంలు ప్రజల్లో పాపులారిటీ ఉన్న నేత కారు.
తాజాగా బీజేపీ తమిళ అధ్యక్షుడు అన్నామలై ఎదుగుదలను అన్నాడీఎంకే తట్టుకోలేకపోతోంది. ఆయన ఎదుగుతున్న తీరును డైజెస్ట్ చేసుకోలేకపోతోంది. అన్నామలై పై కోపంతో అన్నాడీఎంకే చర్యలు స్వీయ నాశనం దిశగా తప్పటడుగులు అడుగులు వేస్తోంది.
మంగళవారం అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ మీటింగ్ లో మరొక్కసారి ఒక తీర్మానం చేశారు. బీజేపీతో మేం జతకట్టం.. మధురై సమావేశాల్లో ఇది ప్రతిపాదించారు. దీని ఉద్దేశం ఒక్కటే. మైనార్టీలకు దగ్గరై.. డీఎంకే కు దగ్గరైన పార్టీలను తన వైపు తిప్పుకోవాలి.. కాంగ్రెస్ ను తమ వైపు తిప్పుకోవాలని అన్నాడీఎంకే ప్రయత్నాలు చేస్తోంది.
అన్నామలై భయంతో తప్పటడుగులు వేస్తున్న అన్నాడీఎంకే తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు