AP Survey: ఏపీలో మరో సంచలన సర్వే వెలుగులోకి వచ్చింది. ఎన్నికలు సమీపిస్తున్న కొలది సర్వేలు హల్ చల్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఎన్నికలకు కొద్ది నెలల వ్యవధి ఉండడంతో అనేక సంస్థలు సర్వేలు చేపడుతున్నాయి. వాటి ఫలితాలను వెల్లడిస్తున్నాయి. తాజాగా జన్మత్ పోల్స్ అనే సర్వే ఏజెన్సీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ప్రజల మూడ్ ను తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో స్పష్టం చేసింది.
రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు సీఎం జగన్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఏకంగా రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను మార్చుతున్నారు. ఇప్పటికే 11 చోట్ల అభ్యర్థులను మార్చారు. దాదాపు 80 మందిని మార్చుతారని ప్రచారం జరుగుతోంది. గత కొద్దిరోజులుగా ఈ అభ్యర్థుల మార్పు విషయమై రకరకాల చర్చ నడుస్తోంది. మరోవైపు ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తోచేతులు కలిపారు. జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఎన్నికల వరకు ప్రజల్లో ఉండాలని డిసైడ్ అయ్యారు. భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు.
సరిగ్గా ఇటువంటి సమయంలోనే జన్మత్ పోల్ సంస్థ తన సర్వే వివరాలను వెల్లడించింది. వచ్చే ఎన్నికల్లో 116 నుంచి 118 స్థానాల్లో వైసిపి గెలవనుందని ప్రకటించింది. టిడిపి, జనసేన కూటమి 46 నుంచి 48 స్థానాలకే పరిమితం కానుంది అని తేల్చి చెప్పింది. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో సైతం ఈ సర్వే సంస్థ చెప్పిన ఫలితాలు దగ్గరగా వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ 61 నుంచి 63 స్థానాల వరకు గెలుచుకుంటుందని తేల్చింది. 65 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. అటు బిఆర్ఎస్ సైతం 45 నుంచి 47 స్థానాలకు పరిమితం కానుంది అని చెప్పగా.. 39 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇప్పుడు ఏపీలో సైతం ఆ సంస్థ ఫలితాలను వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. ఈ ఫలితాలు వైసిపికి ఆనందాన్ని ఇవ్వగా.
. టిడిపి, జనసేన శ్రేణులకు మాత్రం నిరాశ మిగిల్చాయి.