
Jagan On Visakhapatnam: ఆంధ్రప్రదేశ్‌కు పరిపాలన కేంద్రంగా విశాఖ మారుతుందని, త్వరలోనే తాను విశాఖకు వస్తాననిఇ, ఇక్కడి నుంచి పాలన సాగిస్తానని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు.
పుష్కలంగా నీటి వనరులు..
దేశ ప్రగతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో కీలకంగా మారిందని సీఎం వైఎస్.జగన్ విశాఖ వేదికగా జరుగుతున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్)లో జగన్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. దాదాపు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్రం వేదిక కానుందన్నారు.
20 కీలక రంగాల్లో 6 లక్షల మందికి ఉపాధి..
రాష్ట్రంలో 20 కీలక రంగాల్లో ఆరు లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందని తెలిపారు. సదస్సు మొదటి రోజు వివిధ సంస్థలతో 92 ఒప్పందాలు (ఎంవోయూ) జరిగాయి. 340 సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయన్నారు. రాష్ట్రంలో 6 పోర్టులు ఉన్నాయి.. మరో 4 పోర్టులు రాబోతున్నాయని చెప్పారు. పోర్టులకు సమీపంలో పుష్కలంగా భూములు ఉన్నాయన్నారు. నైపుణ్యం కలిగిన యువతకు ఏపీలో కొదవ లేదని తెలిపారు.
పరిపాలన రాజధాని విశాఖే..
ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని విశాఖే అవుతుందని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో జగన్ పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రాగా తాను ఇక్కడి నుంచే త్వరలో పాలన సాగిస్తానని తెలిపారు. రాష్ట్రం నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయని, రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయని పేర్కొన్నారు. భౌగోళికంగా పరిశ్రమలకు ఏపీ అనుకూలంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం, క్రియాశీలక ప్రభుత్వం ఉందని తెలుపుతూ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేశారు.
మా పెట్టుబడులు కొనసాగుతాయి : ముఖేశ్ అంబానీ
ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలకు నియమని అన్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబాని. ఏపీలో కీలక రంగాల్లో వనరులు పుష్కలంగా ఉన్నాయని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ ముందుందని తెలిపారు. సీఎం జగన్ నాయకత్వంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఏపీలో జియో నెట్ వర్క్ వేగంగా వృద్ధి చెందిందని చెప్పారు. సౌర విద్యుత్ రంగంలో రిలయన్స్ పెట్టుబడులు పెడుతుందని తెలిపారు.

ప్రభుత్వం నుంచి సహకారం..
ఆరోగ్యశ్రీ పథకం ఇతర దేశాలకు విస్తరించిందని అపోలో ఆస్పత్రి వైస్ చైర్మన్ తెలిపారు. ఆరోగ్య రంగంలో ఏపీ ప్రభుత్వ కృషి అభినందనీయమన్నారు. అపోలో కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లభిస్తోందని తెలిపారు.
– ఏపీ ప్రగతిలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉందని జిందాల్ స్టీల్ అధినేత నవీన్ జిందాల్ అన్నారు. జీఎస్‌డీపీలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా ఉందని తెలపారు. ఏపీలో జిందాల్ స్టీల్స్ రూ.10 వేల కోట్ల పెట్టుబడులతో ఉపాధి కల్పిస్తామని తెలిపారు.
ఏపీ రాజధాని అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతంది. దీనిపై ఎలాంటి తీర్పు రాలేదు. కోర్పు పరిధిలో ఉన్న అంశంపై మాట్లాడడం సమంజసం కాదు. అయినా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సీఎం జగన్ మాట్లాడారు. మాట్లాడడమే కాదు విశాఖనే ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజాధాని అని వేల మంది ఇన్వెస్టర్ల సమక్షంలో ప్రకటించారు. ఇప్పుడు ఇది చర్చనీయాంశమైంది.