
Love: ప్రేమ ఓ అందమైన భావన. అది మనసును తాకితే ఎవరు కూడా భూమి మీద నిలవలేరు. ఆకాశంలో విహరిస్తుంటారు. ఎవరిని చూసిన వారి ఊహల్లోనే ఉంటారు. ప్రియురాలితో మాట్లాడుతూనే కాలం గడుపుతారు. తాను ప్రేమించిన అమ్మాయి రూపమే వారికి కనిపిస్తుంది. ఇరవై నాలుగు గంటలు ఆమె ధ్యాసలోనే గడుపుతారు. ఎప్పుడు చూసినా ఫోన్ లో కబుర్లు చెప్పుకుంటూనే ఉండటం చూస్తుంటాం. అలా ప్రేమికులు తమ అభిప్రాయాలు పంచుకోవడం సహజమే. ఇక్కడ ఓ చిన్న సందేహం వస్తోంది.
ప్రేమలో ఎవరు ముందు పడతారు? అమ్మాయిలా? అబ్బాయిలా? ఎవరు ప్రేమను వ్యక్తం చేస్తారు? ప్రేమను నిలుపుకోవడంలో ఎవరు ఎక్కువ త్యాగం చేస్తారు? అనే విషయాలపై పలు సర్వేలు చెబుతున్నదేమిటంటే ప్రేమలో ముందు అబ్బాయిలే పడతారు. అబ్బాయిలకు ఒక అమ్మాయిని చూడగానే వారి మనసులో ప్రేమ ఫీలింగ్ ఓ గంటలా మోగుతుంది. దీంతో ఆమె ప్రేమ పొందేందుకు తాపత్రయపడుతుంటాడు. ఆమెను తనవైపు తిప్పుకునేందుకు పలు మార్గాలు అన్వేషిస్తాడు. మొత్తానికి ఆమె ప్రేమను సొంతం చేసుకునే వరకు నిద్రపోడు.
Also Read: Telangana Financial Crisis: అప్పిచ్చి ఆదుకోండి.. ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ..!
ప్రేమను వ్యక్తం చేయడంలో కూడా అబ్బాయిలే ముందుంటారు. తనకు నచ్చిన వారిని ప్రేమిస్తున్నానని చెప్పడానికి సంకోచించరు. తమ ప్రేమను వ్యక్తం చేసి ఆమె అభిప్రాయం కోసం వేచి ఉంటాడు. ఆమె అంగీకరిస్తే అతడి సంతోషానికి అవధులు ఉండవు. చంద్ర మండలంలో అడుగుపెట్టినంత ఆనందం వ్యక్తం చేస్తాడు. ప్రేమను నిలుపుకోవడంలో ఇద్దరు త్యాగం చేయాల్సిందే. అలా అయితేనే ప్రేమ నిలబడుతుందని తెలుసుకుంటే సరి. అమ్మాయిలు మాత్రం అబ్బాయిలకు అంగీకారం తెలిపే ముందు అన్ని ఆలోచిస్తారు.
భవిష్యత్ పై భరోసా ఉంటేనే అమ్మాయిలు ఓకే చెబుతారు. లేదంటే అబ్బాయిలు ఎంత ప్రాధేయపడినా ఒప్పుకోరు. ఈ క్రమంలో ప్రేమలో అబ్బాయిలు పడినంత తొందరగా అమ్మాయిలు పడరు. అన్ని ఆలోచించాకే సరే అంటారు. కానీ డబ్బు లేని వాడిని అంత తేలిగ్గా ఒప్పుకోరు. అబ్బాయిలు మాత్రం అమ్మాయికి ఆస్తి ఉన్నా లేకున్నా ఆమె అందాన్ని చూసే ఇష్టపడతారు. ఇద్దరిలో ఉండే తేడా ఇదే. ప్రస్తుతం లవ్ ఓ ఫ్యాషన్ గా మారిపోయింది. అవసరాలు తీర్చుకోవడానికే ఉపయోగపడుతోంది.
Also Read: Late Night Dinner: రాత్రి ఆలస్యంగా భోజనం చేసే వారందరికీ ఇది అలెర్ట్