Homeఎంటర్టైన్మెంట్Adipurush Movie Tickets : 10000 టిక్కెట్లు ఉచితంగా పంచబోతున్న 'ఆదిపురుష్' మూవీ టీం.. చరిత్రలో...

Adipurush Movie Tickets : 10000 టిక్కెట్లు ఉచితంగా పంచబోతున్న ‘ఆదిపురుష్’ మూవీ టీం.. చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదు!

Adipurush Movie Tickets : ఈ నెల 16 వ తారీఖున యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదల అవ్వబోతున్న సందర్భంగా మూవీ టీం ప్రొమోషన్స్ విషయం లో ఇది వరకు ఎవ్వరూ పాటించని సరికొత్త పద్దతులను పాటిస్తుంది. మనస్ఫూర్తిగా ఆ యుగ పురుషుడు శ్రీరాముడిని స్మరించుకుంటూ మేకర్స్ చేపడుతున్న కార్యక్రమాలు అభిమానులతో పాటుగా ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకర్షిస్తుంది.

ఒక పెద్ద హీరో సినిమా విడుదల అవుతున్నట్టుగా లేదు, శ్రీ రాముని పండుగని ఈనెల మొత్తం జరుపుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. అలాంటి ప్రపంచాన్ని సృష్టించడానికి మేకర్స్ చాలా కష్టపడుతున్నారు. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్, శ్రీరాముని ఉత్సవం లాగా జరిగింది. ఆ వైభోగాన్ని చూసి ప్రభాస్ అభిమానులతో పాటుగా, ప్రపంచం నలుమూలల ఉన్న శ్రీరాముని భక్తులు కూడా పరవశించి పోయారు. ఈ చిత్రం ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యే విధంగా మూవీ టీం ఒక విన్నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

అదేమిటంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వృద్దాశ్రమాలకు, ప్రభుత్వ పాఠశాలలకు మరియు అనాధ శరణాలయాలకు ఉచితంగా 10000 టిక్కెట్లు పంపిణీ చేస్తున్నట్టుగా మూవీ టీం ఒక అధికారిక ప్రకటన చేసింది. శ్రీరాముని చరిత్ర నేటి తరం లో ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలియాల్సిన అవసరం ఉంది, ఆ మహానుభావుడు నడిచిన మార్గం లో అందరూ నడవాల్సిన అవసరం ఉంది, అందుకే మేము ఈ చిత్రాన్ని ఆడియన్స్ కి మరింత చేరువ చెయ్యడం కోసం, ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము.

అందరూ గూగుల్ ఫార్మ్స్ ని నింపి 9505034567 కి కాంటాక్ట్ చెయ్యండి. లేదంటే info@agarwalarts.com మెయిల్ కి పంపించండి అంటూ ఒక ప్రకటన విడుదల చేసారు. దీనికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఇది కేవలం తెలంగాణ కి మాత్రమే అని, ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించి కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయని, త్వరలోనే తెలియచేస్తామని చెప్తున్నారు మేకర్స్.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version