Prabhas: ప్రభాస్ భారీ పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. టాప్ స్టార్ గా వెలుగొందుతున్నాడు. అయితే ఆయన నటించిన తాజా చిత్రాలు వివాదాలు రాజేశాయి. దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ హిందువుల మనోభావాలు దెబ్బతీసింది. ఆదిపురుష్ మూవీపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కల్కి మూవీ లో కూడా హిందూ దేవుళ్లను అవమానించారనే వాదన తెరపైకి వచ్చింది. తాజా వివాదం ఏమిటో చూద్దాం..
గత ఏడాది విడుదలైన ఆదిపురుష్ ప్రభాస్ ఇమేజ్ డ్యామేజ్ చేసింది. ఆయన విమర్శలపాలయ్యాడు. దర్శకుడు ఓం రౌత్ రామాయణాన్ని వక్రీకరించాడు. హిందువుల మనోభావాలు దెబ్బతీశాడంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. మోడ్రన్ రామాయణ పేరుతో ఇతిహాసాలను ఓం రౌత్ మార్చేసే ప్రయత్నం చేశాడు. రావణాసుడి గెటప్ చూసిన హిందువులు ఫైర్ అయ్యారు. అలాగే రావణాసురుడు తన వాహనానికి మాంసాహారం తినిపించడం కూడా వివాదాస్పదం అయ్యింది.
రావణుడు బ్రాహ్మణుడు. పరమ శివవుడి భక్తుడు. ఆయన మాంసాన్ని ముట్టుకోవడం ఏమిటనే ప్రశ్న తలెత్తింది. మూవీలో ప్రధాన పాత్రల గెటప్స్ విషయంలో కూడా ఓం రౌత్ అబాసుపాలయ్యాడు. హనుమంతుడు లంకలో డబుల్ మీనింగ్స్ తో కూడిన డైలాగ్స్ చెప్పడం ఆదిపురుష్ మూవీలో అత్యంత దిగజారుడు వ్యవహారం. రామాయణ, మహాభారతాలు వంటి ఇతిహాసాలను తెరకెక్కించే ముందు కనీసం వాటిని అధ్యయనం చేయాలని తెలియదా అంటూ… ఓం రౌత్ కి చిత్ర ప్రముఖులు సైతం తలంటారు.
ఆదిపురుష్ డిజాస్టర్ కావడంతో ఎవరు పడితే వాళ్ళను రాముడిగా ప్రేక్షకులు అంగీకరించరని ప్రభాస్ ఇజ్జత్ తీశారు బాలీవుడ్ వాళ్ళు. మరి ఈ అనుభవం నుండి ప్రభాస్ ఏం నేర్చుకున్నట్లు లేదు. కల్కి 2829 AD చిత్రంలో కూడా ఇదే తరహా తప్పు చేశాడు. కల్కి మూవీలో ఓ సన్నివేశంలో కాల భైరవుడిని కించపరిచేలా డైలాగ్ ఉంటుంది. ఒక విలన్ ముసలాడి దగ్గర చిన్న లోహపు విగ్రహం చూస్తాడు. ముసలాడిని ఎవడు వీడు? అని అడుగుతాడు.
కాల భైరవుడు… ఒకప్పుడు కాశీ నగరానికి కాపలా కాసే దేవుడు అట అని చెబుతాడు. కాశీ నగరంలో దేవుళ్ళు నిషిద్ధం అని తెలియదా? అంటాడు. దేవుడిని వాడు వీడు అని సంబోధించడంతో నిరసన వ్యక్తమైంది. దాంతో ఆ డైలాగ్ తర్వాత మార్చారు. ఇక భారతాన్ని వక్రీకరించారు. దర్శకుడు సినిమాటిక్ లిబర్టీ పేరుతో మహాభారత పాత్రలను ఇష్టం వచ్చినట్లు చూపించాడని శక్తిమాన్ ఫేమ్ ముఖేష్ ఖన్నా విమర్శించిన సంగతి తెలిసిందే.
పవిత్ర మహాభారతంలో అతిపెద్ద వీరుల్లో ఒకడైన అశ్వద్ధామ పాత్రను కల్కి చిత్రంలో అమితాబ్ చేశాడు. అమితాబ్ ని ప్రభాస్ ఈ చిత్రంలో ముసలోడు అని సంబోధించడం మనం చూడొచ్చు. ఇలా కల్కి మూవీలో కూడా హిందువుల నమ్మకాలను కించపరిచే డైలాగ్స్, సన్నివేశాలు ఉన్నాయని పలువురి వాదన. ప్రభాస్ తన సినిమాలతో హిందూ దేవుళ్లను అవమానించడమే పనిగా పెట్టుకున్నాడని అంటున్నారు.
మరి కల్కి పార్ట్ 2 ఎన్ని వివాదాలు రాజేయనుందో చూడాలి. అసలు కథ కల్కి 2 లోనే ఉందని అంటున్నాడు నాగ్ అశ్విన్. కల్కి 2 కొంత మేర షూటింగ్ జరుపుకుంది. మేజర్ పార్ట్ పెండిగ్ ఉంది. కల్కి 2 విడుదలకు సమయం ఉందని నాగ్ అశ్విన్ స్పష్టత ఇచ్చారు. ప్రభాస్, అమితాబ్ తో పాటు కమల్ హాసన్, దీపికా పదుకొనె కల్కి మూవీలో ప్రధాన పాత్రలు చేశారు. కల్కి వరల్డ్ వైడ్ రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రూ. 1000 కోట్ల మార్క్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.