Jr NTR Devara Glimpses : ఎన్టీఆర్ ‘దేవర’ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్.. పోస్టర్ వైరల్

టాలెంటెడ్ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా శివ కొరటాల దర్శకత్వంలో దేవర: పార్ట్ 1లో నటిస్తున్నారు. ఈ పాన్-ఇండియన్ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తోంది. ఏప్రిల్ 5, 2024న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

Written By: NARESH, Updated On : January 1, 2024 11:36 am
Follow us on

Jr NTR Devara Glimpses : ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ అభిమానుల కరువు తీర్చే రోజు వచ్చేసింది. సంక్రాంతి ముందర జనవరి 8న ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ నుంచి బిగ్ అప్టేట్ ను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు ఓ వీరలెవల్లో ఉన్న పోస్టర్ ను కూడా రిలీజ్ చేసి అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు.

టాలెంటెడ్ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా శివ కొరటాల దర్శకత్వంలో దేవర: పార్ట్ 1లో నటిస్తున్నారు. ఈ పాన్-ఇండియన్ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తోంది. ఏప్రిల్ 5, 2024న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

దేవర అప్టేట్ కోసం ఫ్యాన్స్ ఆత్రూుతగా ఎదురుచూస్తున్నారు. జనవరి 8, 2024న విడుదలవుతుందని మేకర్స్ ఇప్పుడే పోస్టర్ తో ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఓ భారీ పోస్టర్‌ను విడుదల చేసారు. అభిమానులకు వీనుల విందు పంచారు. దీంతో 8వ తేదీన విడుదల చేసే గ్లింప్స్ కోసం ఆసక్తిగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

దేవరా చిత్రంలో సైఫ్ అలీఖాన్, ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, కలైయరసన్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యంగ్ సెన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ రూపొందించిన సంగీతం హైలెట్ గా నిలవనుందట.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కి నిర్మాతలుగా ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ చేతులు కలిపాయి.