https://oktelugu.com/

ఇంటి నుంచే ఆధార్ అప్ డేట్ చేసుకునే ఛాన్స్.. ఎలా అంటే..?

మన దేశంలో నివశించే వారికి అవసరమైన గుర్తింపు కార్డులలో ఆధార్ కార్డ్ ఒకటనే సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను పొందాలన్నా, బ్యాంకుల్లో లోన్ కోసం దరఖాస్తు చేయాలన్నా, సిమ్ కార్డ్ పొందాలన్నా కూడా ఆధార్ కార్డ్ అవసరమనే సంగతి తెలిసిందే. అయితే అంత ముఖ్యమైన ఆధార్ కార్డులో వివరాలు తప్పుగా నమోదై ఉంటే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు. ఆధార్ కార్డు ఒక్కటి ఉంటే దేశంలో ఎక్కడికి వెళ్లినా గుర్తింపు కార్డుగా ఆధార్ ను […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 3, 2021 / 11:18 AM IST
    Follow us on

    మన దేశంలో నివశించే వారికి అవసరమైన గుర్తింపు కార్డులలో ఆధార్ కార్డ్ ఒకటనే సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను పొందాలన్నా, బ్యాంకుల్లో లోన్ కోసం దరఖాస్తు చేయాలన్నా, సిమ్ కార్డ్ పొందాలన్నా కూడా ఆధార్ కార్డ్ అవసరమనే సంగతి తెలిసిందే. అయితే అంత ముఖ్యమైన ఆధార్ కార్డులో వివరాలు తప్పుగా నమోదై ఉంటే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు. ఆధార్ కార్డు ఒక్కటి ఉంటే దేశంలో ఎక్కడికి వెళ్లినా గుర్తింపు కార్డుగా ఆధార్ ను వినియోగించుకోవచ్చు.

    Also Read: ప్రపంచం త్వరలోనే అంతం.. డూమ్స్ డే క్లాక్ ఏం చెబుతోందంటే..?

    ఆధార్ కార్డ్ లోని వివరాలను అప్ డేట్ చేసుకోవాలని అనుకుంటే సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సంప్రదించాల్సి ఉంటుందీ. ఆధార్ కేంద్రం ద్వారా మాత్రమే ఆధార్ కార్డ్ ను అప్ డేట్ చేసుకునే అవకాశం ఉండి. కొన్ని వివరాలను మాత్రం ఆధార్ కార్డు ఉన్నవారికి ఆన్ లైన్ ద్వారా మార్చుకునే అవకాశాన్ని యూఐడీఏఐ కల్పించింది. యూఐడీఏఐ కొత్త ఫీచర్ ద్వారా ఆధార్ వివరాలను అప్ డేట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

    Also Read: పోస్టాఫీస్ లో సూపర్ స్కీమ్స్.. ఎక్కువ రాబడి పొందే ఛాన్స్..?

    అయితే ఆధార్ కేంద్రం ఎక్కడ ఉందో తెలియకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. యూఐడీఏఐ ఆధార్ కార్డ్ ఉన్నవారి కోసన్ ఒక టోల్ ఫ్రీ నంబర్ ను అందుబాటులోకి తెచ్చింది. 1947 నంబర్ కు కాల్ చేయడం ద్వారా ఆధార్ కేంద్రాన్ని సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎం ఆధార్ యాప్ సహాయంతో ఇంటి నుంచే కొన్ని ఆధార్ కార్డుకు సంబంధించిన వివరాలను కూడా అప్ డేట్ చేసుకోవచ్చు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    యూఐడీఏఐ ట్విట్టర్ ద్వారా ఈ విషయాలను వెల్లడించింది. ఆధార్ కార్డులో సులభంగా మార్పులు చేసుకునే విధంగా యుఐడీఏఐ అవకాశం కల్పించడంతో ఆధార్ కార్డ్ ఉన్నవాళ్లకు ప్రయోజనం చేకూరనుంది. ఎం ఆధార్ యాప్ ను వినియోగించి సులభంగా వివరాలు మార్పు చేసుకునే అవకాశం ఉంది.