Software Engineers : సినిమా థియేటర్లోనూ పనియే.. పాపం బెంగళూరు టెకీలు.. వీడియో వైరల్

ఇదిలా ఉండగా, కొంత మంది ఎక్కడ పనిచేశామన్నది ముఖ్యం కాదని, వర్క్‌ పినిష్‌ అయిందా లేదా అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : January 17, 2024 11:44 pm
Follow us on

Software Engineers : కరోనా కారణంగా టెకీలకు వర్క్‌ ఫ్రం హోం అవకాశాలు కల్పించాయి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు. దీంతో ఇటు ఉద్యోగులకు, అటు కంపెనీకి లాభం కలిగింది. కంపెనీలకు ఆఫీస్‌ అద్దె భారం తప్పగా, టెకీలకు ఇంట్లోనే పని చేసుకునే అవకాశం దక్కింది. అయితే ఈ వర్క్‌ ఫ్రం హోం అవకాశాన్ని కొతమంది దుర్వినియోగం చేస్తున్నారు. కొందరు ఇతర కంపెనీల ప్రాజెక్టులు చేస్తూ అదనపు ఆదాయం సంపాదిస్తుండగా, మరికొందరు ఎంజాయ్‌ చేస్తూ వర్క్‌ చేస్తున్నారు. ఇలా సినిమా థియేటర్‌లో వర్క్‌ చేస్తూ ఓ యువకుడు అదే థియేటర్‌లో సినిమా చూసేందుకు వచ్చిన వారి ఫోన్‌ కెమెరాకు చిక్కాడు. అదే వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇలా బెంగళూర్‌కు చెందిన టెకీ ఫేమస్‌ అయ్యాడు. ఒకవైపు థియేటర్‌లో సినిమా చూస్తూ, మరోవైపు ల్యాప్‌ టాప్‌లో వర్క్‌ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఇంట్లో పనిచేయలేక..
కరోనా కారణంగా చాలా సంస్థలు వర్క్‌ ఫ్రం హోం అవకాశం కల్పించాయి. దాదాపు రెండేళ్లుగా ఇళ్లలో ఉండి పనిచేస్తున్న కొందరు టెక్కీలు దానిని బోర్‌గా ఫీల్‌ అవుతున్నారు. ఇంట్లో పని చేయలేక తమకు నచ్చిన ప్రదేశాల్లో కూర్చొని ఆఫీస్‌ పని చక్కబెడుతున్నారు. బెంగళూరులో ఓ యువకుడు థియేటర్‌లో సినిమా చూస్తూ తన పని చేసుకుంటూ కనిపించాడు. ఒకవైపు సినిమా చూస్తూనే మరోవైపు ల్యాప్‌టాప్‌లో వర్‌ చేస్తూ కనిపించాడు. కేపీ అనే ఓ ట్విట్టర్‌ యూజర్‌ దీనిని షూట్‌ చేసి ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. బెంగళూరులోని స్వాగత్‌ ఓనిక్స్‌ థియేటర్‌ లో ఎర్లీ మార్నింగ్‌ షో చూడటానికి వెళ్లిన ఓ యువకుడు ఇలా ల్యాప్‌ టాప్‌ ఓపెన్‌ చేసి వర్క్‌ చేస్తున్నాడని ఎక్స్‌లో రాసుకొచ్చాడు.

ఫన్నీ కామెంట్లు పెడుతున్న నెటిజన్లు..
సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వర్క్‌ ఫ్రం థియేటర్‌ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. కొంతమంది యువకుడి తీరును తప్పు పడుతుంటే… మరికొందరు థియేటర్‌ లో కాకుండా పార్కులోనో, గార్డెన్‌ లోనో వర్క్‌ చేసుకుంటే బాగుండేదని కామెంట్స్‌ పెడుతున్నారు. ఇంకొందరు అత్యవసర పని ఉంటే ఇలా చేశాడేమో అని కామెంట్‌ చేస్తున్నారు. యువకుడిని సమర్థిస్తున్నారు. ఇక ఈ వీడియో షేర్‌ చేసిన కేపీ కూడా స్పందిస్తూ.. ఈ వీడియో ఉదయం 4 గంటల షో సినిమాలో తీసిందని తెలిపాడు.

ఇదిలా ఉండగా, కొంత మంది ఎక్కడ పనిచేశామన్నది ముఖ్యం కాదని, వర్క్‌ పినిష్‌ అయిందా లేదా అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.