Tarakaratna condition : నందమూరి తారకరత్న ఆరోగ్యం మరింత విషయంగా మారింది. శనివారం ఉదయం ఆయన వైద్యానికి స్పందిస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే వైద్యుల అధికారిక బులెటిన్ ఆందోళన పెంచేసింది. తారకరత్న పరిస్థితి విషమంగానే ఉంది. మాక్సిమమ్ లైఫ్ సపోర్ట్ కొనసాగిస్తున్నాము. పలు విభాగాలకు చెందిన నిపుణులు పర్యవేక్షిస్తున్నారంటూ ప్రెస్ నోట్ విడుదల చేశారు. దీంతో తారకరత్నకు ఏమవుతుందనే విచారం అభిమానుల్లో ఎక్కువైంది. నిన్న టీడీపీ లీడర్ చంద్రబాబు నాయుడు బెంగుళూరు వెళ్లారు. తారకరత్న హెల్త్ కండిషన్ గురించి డాక్టర్స్ ని ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. బాలయ్య అక్కడే ఉంటూ పర్యవేక్షిస్తున్నారు.

నేడు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బెంగుళూరు వెళ్లడం జరిగింది. అన్నదమ్ములిద్దరూ కుటుంబ సభ్యులతో పాటు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్నారు. తారకరత్న ప్రస్తుత పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. నిన్నే టీడీపీ వర్గాలు, నందమూరి అభిమానులు భారీగా NH హాస్పిటల్ వద్ద గుమిగూడారు. ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది. ఎన్టీఆర్ రాకను తెలుసుకున్న కన్నడ అభిమానులు పెద్ద మొత్తంలో ఆసుపత్రికి చేరుకున్నారు. తారకరత్నకు ఏమవుతుందోనన్న ఆందోళన కొనసాగుతోంది. అయితే అభిమానులు ఆయన తిరిగి వస్తారన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తాతయ్య ఎన్టీఆర్ ఆశీస్సులు, అభిమానుల ప్రార్థనలు తారకరత్నను కాపాడతాయన్న నమ్మకంతో ఉన్నారు. జనవరి 27 మధ్యాహ్నం కుప్పంలో తారకరత్న అనారోగ్యం బారిన పడ్డారు. నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర చేపట్టారు. స్థానిక మందిరాల్లో పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్రకు నారా లోకేష్ బయలుదేరారు. ఈ కార్యక్రమానికి టీడీపీ శ్రేణులు హాజరయ్యాయి. బాలయ్యతో పాటు టీడీపీ సీనియర్ నేతలు నారా లోకేష్ తో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు.
తారకరత్న కూడా యువగళం కార్యక్రమంలో పాల్గొన్నారు. జనాల మధ్య నడుస్తున్న తారకరత్న ఒక్కసారిగా కిందపడిపోయారు. అపస్మారక స్థితిలోకి చేరుకున్న తారకరత్నను పక్కనే ఉన్న కార్యకర్తలు, గార్డ్స్ వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తారకరత్న కండిషన్ క్రిటికల్ గా ఉందని వైద్యులు గుర్తించారు. ఆయన పల్స్ రేటు కూడా పడిపోయింది. సీపీఆర్ చేయడం ద్వారా పల్స్ మెరుగైనట్లు వెల్లడించారు. మెరుగైన వైద్యం కోసం శుక్రవారం అర్ధరాత్రి బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. ఇటీవల తారకరత్న ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. అంతలోనే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
NTR @tarak9999 & @NANDAMURIKALYAN at Narayana Hrudayala, Blr to visit #TarakaRatna pic.twitter.com/c0NkrPcEsV
— Nandamurifans.com (@Nandamurifans) January 29, 2023