https://oktelugu.com/

గూగుల్ లో సెర్చ్ చేయకూడని ఎనిమిది విషయాలు ఏమిటంటే..?

మనలో చాలామంది ఎలాంటి సమాచారం తెలుసుకోవాలన్నా గూగుల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. గూగుల్ చాలా విషయాలను కచ్చితంగా చెబుతుందని భావిస్తూ ఉంటారు. అయితే కొన్ని విషయాలను మాత్రం గూగుల్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ సెర్చ్ చేయకూడదు. కొన్నిసార్లు గూగుల్ లో కూడా ఫేక్ డేటా ఉంటుంది. ఈ ఫేక్ డేటా వల్ల పర్సనల్ డేటా కూడా లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. గూగుల్ లో కస్టమర్ కేర్ కాంటాక్ట్ నెంబర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వెతకకూడదు. చాలామంది […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 26, 2021 / 01:51 PM IST
    Follow us on

    మనలో చాలామంది ఎలాంటి సమాచారం తెలుసుకోవాలన్నా గూగుల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. గూగుల్ చాలా విషయాలను కచ్చితంగా చెబుతుందని భావిస్తూ ఉంటారు. అయితే కొన్ని విషయాలను మాత్రం గూగుల్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ సెర్చ్ చేయకూడదు. కొన్నిసార్లు గూగుల్ లో కూడా ఫేక్ డేటా ఉంటుంది. ఈ ఫేక్ డేటా వల్ల పర్సనల్ డేటా కూడా లీక్ అయ్యే అవకాశం ఉంటుంది.

    గూగుల్ లో కస్టమర్ కేర్ కాంటాక్ట్ నెంబర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వెతకకూడదు. చాలామంది సైబర్ మోసగాళ్లు ఫేక్ కస్టమర్ల డేటా కాంటాక్ట్ నెంబర్లను వినియోగిస్తూ ఉంటారు. గూగుల్ లోని ఫేక్ కస్టమర్ కేర్ నంబర్లకు కాల్ చేస్తే మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఆన్ లైన్ బ్యాంకింగ్ యూ.ఆర్.ఎల్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్నిసార్లు యూ.ఆర్.ఎల్ బ్యాంకుకు సంబంధించినదో కాదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

    Also Read: ఎస్బీఐ సూపర్ స్కీమ్.. నెలనెలా డబ్బులు తీసుకునే ఛాన్స్..?

    బ్యాంకు లింకుల మాదిరిగానే మాల్ వేర్ లింకులను క్లిక్ చేస్తే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గూగుల్ ద్వారా యాప్స్ కోసం వెతకడం మంచిది కాదు. ఏదైనా అనారోగ్యంతో బాధ పడుతూ ఉంటే ఆ అనారోగ్య లక్షణాల గురించి గూగుల్ లో సెర్చ్ చేయకూడదు. గూగుల్ సెర్చ్ లో కనిపించే మెడికల్ డేటా, నూట్రిషియన్, బరువు తగ్గే టిప్స్ సమాచారం గురించి గుడ్డిగా నమ్మకూడదు.

    Also Read: దేశంలో బ్యాన్ కానున్న వాట్సాప్ యాప్.. నిజమేనా..?

    బరువు తగ్గాలనుకుంటే డాక్టర్ ను కలవడం చేయాలే తప్ప గూగుల్ లో ఉన్న సమాచారం ద్వారా బరువు తగ్గే ప్రయత్నం చేయకూడదు. పర్సనల్ ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లకు సంబంధించిన టిప్స్ గురించి కూడా గూగుల్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ వెతకకూడదు. గూగుల్ సెర్చ్ ఫలితాలను బట్టి ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ చేయకూడదు. మార్కెట్ విశ్లేషకుల సలహాలు సూచనల ద్వారా మాత్రమే ఇన్వెస్ట్ మెంట్ చేయాలి.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    సెర్చ్ రిజల్ట్స్ లో కనిపించే ప్రతి యూఆర్ఎల్ సైబర్ నేరగాళ్ల మాల్ వేర్ లింకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ వెబ్ సైట్ల లింకుల పేరుతో ఫేక్ వెబ్ సైట్ల లింకులు కూడా ఉంటాయి. ఈ-కామర్స్ వెబ్ సైట్ల కూపన్ల కోసం గూగుల్ లో అస్సలు సెర్చ్ చేయకూడదు. గూగుల్ లో బ్యాంక్ అకౌంట్ వివరాలను ఎంటర్ చేయకూడదు.