National Awards 2023 : 69వ నేషనల్ అవార్డ్స్: దుమ్మురేపిన తెలుగు సినిమా… మొత్తం ఎన్ని అవార్డ్స్ అంటే!

గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో తెలుగు సినిమా అవార్డులు సొంతం చేసుకోలేదు. నేడు తెలుగు సినిమాకు ప్రౌడ్ మూమెంట్ అనడంలో సందేహం లేదు.

Written By: NARESH, Updated On : August 24, 2023 7:13 pm
Follow us on

69th National Awards : నేడు 69వ నేషనల్ అవార్డ్స్ లలో తెలుగు సినిమా దుమ్ము దులిపింది. ఉత్తమ నటుడు, ఉత్తమ సింగర్, సంగీత దర్శకుడు, రచయిత అవార్డులతో పాటు మరికొన్ని కొల్లగొట్టింది. ముఖ్యంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ ఐదు విభాగాల్లో నేషనల్ అవార్డ్స్ సొంతం చేసుకుంది. ఉత్తమ కొరియోగ్రాఫర్ గా నాటు నాటు సాంగ్ కి ప్రేమ్ రక్షిత్ అవార్డుకి ఎంపికయ్యారు. ఆర్ ఆర్ ఆర్ మూవీలోని కొమరం భీముడో సాంగ్ పాడిన కాల భైరవ ఉత్తమ సింగర్ గా ఎంపికయ్యాడు.

ఇక ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డుకి ఇద్దరు తెలుగు వారు ఎంపికయ్యారు. పుష్ప చిత్రంలోని సాంగ్స్ కి గానూ దేవిశ్రీ ప్రసాద్ అవార్డు గెలుచుకున్నారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి కీరవాణి నేషనల్ అవార్డ్ అందుకోనున్నారు. వీరిద్దరూ తెలుగువారే కావడం విశేషం. అలాగే ఆర్ ఆర్ ఆర్ మూవీ యాక్షన్ కొరియోగ్రఫీ విభాగంలో కూడా అవార్డు సొంతం చేసుకుంది. కింగ్ సాల్మన్ ఎంపికయ్యాడు. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆర్ ఆర్ ఆర్ నుండి వి. శ్రీనివాస మోహన్ అవార్డు అందుకోనున్నారు. మోస్ట్ పాప్యులర్ మూవీ ప్రొవైడింగ్ వోల్ సమ్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎంపికైంది. అలాగే బెస్ట్ తెలుగు ఫిల్మ్ క్రిటిక్ గా పురుషోత్తమాచార్యలు ఎంపికయ్యారు.

ఆర్ ఆర్ ఆర్ మొత్తంగా ఆరు విభాగాల్లో నేషనల్ అవార్డ్స్ కొల్లగొట్టింది. అలాగే కొండపొలం చిత్రానికి ఉత్తమ పాటల రచయిత విభాగంలో నేషనల్ అవార్డు దక్కింది. ధం ధం ధం సాంగ్ రచించిన చంద్రబోస్ నేషనల్ అవార్డు గెలుచుకున్నారు. డెబ్యూ డైరెక్టర్ ఉప్పెన బుచ్చిబాబు కూడా నేషనల్ అవార్డుకి ఎంపికయ్యాడు. ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన ఎంపికయ్యింది.

వీటన్నింటికీ మించి అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. పుష్ప చిత్రంలోని నటనకు గానూ ఆయనను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ఇలా నేషనల్ అవార్డ్స్ లో తెలుగు సినిమా సత్తా చాటింది. మొత్తంగా 11 నేషనల్ అవార్డ్స్ తెలుగు సినిమాకు దక్కాయి. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో తెలుగు సినిమా అవార్డులు సొంతం చేసుకోలేదు. నేడు తెలుగు సినిమాకు ప్రౌడ్ మూమెంట్ అనడంలో సందేహం లేదు.