Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ డిసెంబర్ 20 వ తేదీన తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతలా ఎదురు చూసారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. షూటింగ్ పూర్తి అయ్యినప్పటికీ కూడా ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ బయటకి రాకపోవడంతో అభిమానులు అసహనం కి గురై మేకర్స్ మీద ట్విట్టర్ లో పెద్ద ఎత్తున నెగటివ్ ట్రెండ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎట్టకేలకు అభిమానుల కోరిక మేరకు వినాయక చవితి రోజు ఈ సినిమాలోని రెండవ పాటకు సంబంధించిన పోస్టర్ ని విడుదల చేస్తే అతి త్వరలోనే పాటకు సంబంధించిన అప్డేట్ ఇస్తామని చెప్పారు.
నిన్న ఈ పాటకు సంబంధించిన స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు థమన్, శంకర్. నేడు కాసేపటి క్రితమే ఈ పాట ప్రోమో ని విడుదల చేసారు. పాట ప్రోమో వినగానే చార్ట్ బస్టర్ అనిపించింది. ఫాస్ట్ బీట్స్ తో థమన్ అదిరిపోయే ట్యూన్ అందించాడు. ఇక పిక్చరైజేషన్ లో శంకర్ తన మార్కు ని చూపించాడు. ఆ పాటలు ఎంత భారీ గా ఉంటాయో మన చిన్నతనం నుండి చూస్తూనే ఉన్నాం. సినిమా బడ్జెట్ కి పెట్టే డబ్బులతో సగం ఆయన పాటల కోసమే ఖర్చు చేస్తాడు. అంత ప్రత్యేకమైన ఆసక్తి అన్నమాట. ‘గేమ్ చేంజర్’ చిత్రం లో కూడా తన వింటేజ్ కోణాన్ని బయటకి తీసాడు. మొదటి పాట ‘జరగండి..జరగండి’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ పాటలో సెట్టింగ్స్ ని చూస్తే వింటేజ్ శంకర్ మార్క్ కనిపిస్తుంది. ఈరోజు విడుదలైన ‘రా మచ్చ మచ్చ’ సాంగ్ లో కూడా అదే మార్క్ కనిపించింది. దేశం లో వివిధ సాంస్కృతిక నృత్యాలు చేసే కళాకారులను ఈ పాట కోసం తీసుకొచ్చాడు శంకర్. వాళ్లంతా ఈ ప్రోమో లో కనిపించారు.
సినిమాలో ఈ పాట రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ గా ఉంటుందట. రామ్ చరణ్ కెరీర్ లో ఇంట్రడక్షన్ సాంగ్స్ కి ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతీ పాట సూపర్ హిట్ అయ్యింది. ఈ పాట మరింత ప్రత్యేకం. ఇందులో రామ్ చరణ్ వేసిన స్టెప్పులు చూస్తుంటే, పూర్తి లిరికల్ వీడియో విడుదలైన తర్వాత లక్షల సంఖ్యలో ఇంస్టాగ్రామ్ లో రీల్స్ వచ్చే అవకాశం ఉంది. బాలీవుడ్ లో టాప్ కొరియోగ్రాఫర్ గా పిలవబడే గణేష్ ఆచార్య ఈ పాటకు కొరియోగ్రఫీ చేసాడు. వైజాగ్ బీచ్ రోడ్ లో ఈ పాటని చిత్రీకరించారు. షూటింగ్ సమయం లో అభిమానులు చాలామంది వీడియోలు తీసి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. వైజాగ్ లో కేవలం పాటలను మాత్రమే కాదు, కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. ఇందులో రామ్ చరణ్ రాజకీయ నాయకుడిగా, IAS ఆఫీసర్ గా ద్విపాత్రాభినయం చేసాడు.