ప్రముఖ ఐటీ కంపెనీలలో ఒకటైన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కంపెనీలో పని చేసే ఉద్యోగుల కోసం ఏకంగా 700 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బోనస్ గా ప్రకటించింది. స్పెషల్ బోనస్ గా హెచ్‌సీఎల్ ప్రకటించిన ఈ మొత్తం ఉద్యోగులకు ప్రతి సంవత్సరం ఇచ్చే బోనస్ కంటే ఎక్కువ మొత్తం కావడం గమనార్హం. కంపెనీ భారీ మొత్తం బోనస్ ప్రకటించడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: వాట్సాప్ కు కేంద్రం షాక్.. కొత్త యాప్ ను ప్రారంభించనున్న కేంద్రం..?
హెచ్‌సీఎల్ సంస్థలో పని చేసే ఉద్యోగులు ఈ నెల వేతనంతో పాటు స్పెషల్ బోనస్ ను పొందనున్నారని తెలుస్తోంది. మార్చి నెలలో ఉద్యోగులు ప్రతి నెలా కంపెనీ నుంచి పొందే జీతంతో పాటు స్పెషల్ బోనస్ ను పొందే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సంస్థ పది బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించటంతో కంపెనీలో పని చేసే ఉద్యోగుల కోసం సంస్థ భారీ బోనస్ ను ప్రకటించినట్టు తెలుస్తోంది.
Also Read: గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే రూ.1,600 పొందే ఛాన్స్.. ఎలా అంటే..?
భారతదేశ కరెన్సీ ప్రకారం హెచ్‌సీఎల్ సంస్థ ఆర్జించిన సంపాదన విలువ 72,800 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మానవ వనరుల విభాగాధిపతి వీవీ అప్పారావు ఉద్యోగులకు స్పెషల్ బోనస్ ను ప్రకటించినట్టు వెల్లడించారు. కొద్దిసేపటి క్రితం ఈ మేరకు ప్రకటన విడుదలైంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఉద్యోగులకు స్పెషల్ బోనస్ ప్రకటించిన నేపథ్యంలో మిగతా సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడా ఇదే విధంగా ఉద్యోగులకు బోనస్ ను ప్రకటిస్తాయేమో చూడాల్సి ఉంది. పముఖ ఐటీ కంపెనీలలో కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుంటే కొన్ని కంపెనీలు మాత్రం ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం గమనార్హం.