మెగాస్టార్ చిరంజీవి ‘ఉప్పెన’ టీం సభ్యులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. తన మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తొలి చిత్రం పెద్ద హిట్ కావడంతో చిరంజీవి సంతోషంగా ఉన్నారు. ‘ఉప్పెన’ టాలీవుడ్ లో బంపర్ హిట్ కొట్టడంతో వారందరికీ గిఫ్ట్ లు పంపారు. చిరంజీవి ఈ చిత్రాన్ని స్క్రిప్టింగ్ దశ నుండే నిశితంగా పరిశీలించి మార్పులు చేర్పులు చేసి పక్కాగా రెడీ చేశారు. అలాంటి పాత్రలో వైష్ణవ్ తేజ్ ను నటింపచేశాడు.
Also Read: శంకర్ -రాంచరణ్ సినిమాలో పవన్ ప్లేసులో కోలివుడ్ స్టార్
ఈ చిత్రం రూ .50 కోట్ల (షేర్) క్లబ్‌లో చేరబోతున్న తరుణంలో చిరంజీవి వ్యక్తిగతంగా వారందరికీ గిఫ్ట్స్ పంపారు. సినిమాలోని ప్రధానంగా తారాగణంతోపాటు పనిచేసిన సిబ్బందికి గిఫ్ట్ హాంపర్‌లను పంపారు. దేవి శ్రీ ప్రసాద్, దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాతలు నవీన్ మరియు రవి, నటి కృతిశెట్టి తదితరులు వ్యక్తిగతీకరించిన బహుమతులు.. వ్యక్తిగత శుభాకాంక్షలు పంపారు.
Also Read: తేజ మరో సంచలనం.. ఏకంగా 45 మంది కొత్తవారితో చిత్రం
చిరంజీవి కుటుంబం నుండి వైష్ణవ్ తేజ్ నటుడిగా మారిన 10వ హీరో. వీరందరూ తమ ప్రవేశం కోసం చిరంజీవి బ్రాండ్‌ను ఉపయోగించారు. వైష్ణవ్ తేజ్ తన మొదటి చిత్రంతో గ్రాండ్ హిట్ కొట్టాడు. పెద్ద స్టార్ మూవీతో సమానంగా కలెక్షన్లు వసూలు చేయడంతో చిరంజీవి ఉప్పెన టీం సభ్యులకు గిఫ్ట్ లు పంపి సంతోష పరిచారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్