Google: 2274 కోట్ల ఫైన్: గూగుల్ కి చుక్కలు చూపించిన ముగ్గురు భారత యువత!

Google: ప్రతీ ప్రశ్నకు సమాధానం చెప్పే గూగుల్.. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ముందు తలొంచింది. గూగుల్ తప్పులపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసి భారీ జరిమానా విధించింది. వ్యాపారంలో అనైతిక చర్యలకు పాల్పడుతోందంటూ వచ్చిన నివేదిక ఆధారంగా సీసీఐ 2019 నుంచి విచారణను ప్రారంభించింది. సుధీర్ఘ విచారణ తరువాత 2022 అక్టోబర్ 20న గూగుల్ పై రూ.1,337.76 కోట్ల ఫైన్ వేసింది. అలాగే ఈ అక్టోబర్ 25న రూ.936.44 కోట్ల మరోసారి జరిమానా విధించింది. మొత్తం […]

Written By: SHAIK SADIQ, Updated On : October 30, 2022 1:02 pm
Follow us on

Google: ప్రతీ ప్రశ్నకు సమాధానం చెప్పే గూగుల్.. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ముందు తలొంచింది. గూగుల్ తప్పులపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసి భారీ జరిమానా విధించింది. వ్యాపారంలో అనైతిక చర్యలకు పాల్పడుతోందంటూ వచ్చిన నివేదిక ఆధారంగా సీసీఐ 2019 నుంచి విచారణను ప్రారంభించింది. సుధీర్ఘ విచారణ తరువాత 2022 అక్టోబర్ 20న గూగుల్ పై రూ.1,337.76 కోట్ల ఫైన్ వేసింది. అలాగే ఈ అక్టోబర్ 25న రూ.936.44 కోట్ల మరోసారి జరిమానా విధించింది. మొత్తం 2,274.2 ఫైన్ చెల్లించాలని ఆదేశించింది. గూగుల్ మార్కెట్ గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందని, దీంతో యాప్ డెవలపర్లు తీవ్రంగా నష్టపోయారని పేర్కొంది. అయితే గూగుల్ కు ఇంతగా ఫైన్ వేయడానికి ఓ ముగ్గురు వ్యక్తులు కారణమని తెలుస్తోంది. కొన్ని నెలల పాటు వీరు గూగుల్ పై పరిశోధనలు చేసిన నివేదికను ఈ ముగ్గురు సీసీకి అందించారు. ఆ ముగ్గురు వ్యక్తుల గురించి స్పెషల్ ఫోకస్..

ఉమర్ జావిద్, సుకర్మ తపర్, అకిబ్ జావిద్ లు కలిసి గూగుల్ మోసాన్ని బయటపెట్టాడు. భారత్ లో గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఈ సంస్థ ఆధిపత్యం కోసం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. దీనిపై వీరు 2018 నుంచి నాలుగు నెలల పాటు పరిశోధన చేసి ఆ నివేదికను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కు సమర్పించారు. దీంతో 2019లో గూగుల్ పై విచారణ ప్రారంభమైంది. అనంతరం 2022 అక్టోబర్ 20న సీసీఐ రూ.1,338 కోట్ల జరిమానా విధించింది. ఆ తరువాత 25న మరోసారి 936.44 కోట్ల ఫైన్ విధించింది.

స్మార్ట్ ఫోన్ పనిచేయాలంటే దానికి ఓఎస్ (ఆపరేటింగ్ సిస్టమ్) కావాలి. ఇందులో ఆండ్రాయిడ్ ఒకటి. దీనిని గూగుల్ 2005లో కొనుగోలు చేసింది. భారత్ కు చెందిన చాలా మొబైల్స్ ఇదే ఆపరేటింగ్ సిస్టమ్ తో నడుస్తున్నాయి. ఈ ఆరేటింగ్ సిస్టం ప్లేస్టోర్, గూగుల్ సెర్చ్, గూగుల్ క్రోమ్, యూట్యూబ్ తదితర అప్లికేషన్లు కలిగి ఉన్నాయి. అయితే వీటి ద్వారా గూగుల్ వ్యతిరేక పద్ధతులు అవలంభిస్తోందంటూ సీసీఐ పేర్కొంది. గూగుల్ అందించే ఫ్రీ యాప్స్ డిలీట్ చేయకుండా నిరోధించడం వంటివి చేయకుండా రూపొందించింది. అయితే ఇవి భారత్ కు చెందిన మిగతా యాప్ డెవలపర్లపై ప్రభావం చూపుతోందని వారు కనుగొన్నారు.

ఈ క్రమంలో భారతదేశంలో డిజిటల్ మార్కెట్ ఎలా రూపుదిద్దుకుంటోంది..? టెక్నాలజినీ నియంత్రించేందుకు ఎలాంటి చట్టాలు ఉన్నాయి..? అనే విషయాలపై ఉమర్ జావిద్, సుకర్మ తపర్, అక్విబ్ జావిద్ లకు ఆసక్తి ఉండేది. ఇదే సమయంలో 2018లో యాంటీ ట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు యూరోపియన్ కమిషన్ (EU) గూగుల్ పై 4.34 బిలియన్ యూరోల జరిమానా విధించింది. భారత మొబైల్ మార్కెట్లోనూ ఆండ్రాయిడ్ కు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఇక్కడ ఉన్న లోసుగులేంటో తెలుసుకోవాలని వీరు ముగ్గురు నిర్ణయించుకున్నారు. ఈ ముగ్గురు 2018లో పరిశోధనలు ప్రారంభించారు.

దాదాపు రెండు నెలల పాటు గోప్యంగా పరిశోధనలు చేసిన వీరు అత్యంత పకడ్బందీగా సీసీఐకి నివేదికను ఇచ్చారు. ‘ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ కు చెందిన ఎన్నో అవసరం లేని యాప్ లు కనిపిస్తున్నాయి. వీటితో ఇండియన్ యాప్ డెవలపర్లు నష్టపోయే అవకాశం ఉంది. కానీ గూగుల్ తన గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తూ మన భారతీయ యాప్ లను దెబ్బతీసేలా దానికి అవసరమైన యాప్ లనే ప్రోత్సహించేలా కుట్ర చేస్తోందని..’ అని సుకర్మ థాపర్ ఫిర్యాదు చేశారు.. అయితే ఈ ఆరోపణలకు మరింత బలం చేకూర్చడానికి మరింత పరిశోధనలు చేయాల్సి ఉందని అమె పేర్కొన్నారు.

ఉమర్ జావిద్ న్యూ ఢిల్లీలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో రీసెర్చ్ అసోసియేట్ గా పనిచేస్తున్నారు. ఈయన కాశ్మీర్ విశ్వ విద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యాడు. సుకర్మ థాపర్ కూడా సీసీఐ లో రీసెర్చ్ అసోసియేట్ గా పనిచేస్తున్నారు. ఈమె 2016లో నల్సార్ నుంచి పీజీ పట్టా పొందారు. ఇక ఆకిబ్ జావిద్ కాశ్మీర్ యూనివర్సిటలో చదువుతున్నప్పుడు కాంపిటీటీషన్ కమిషన్ ఇండియాలో కొంతకాలం ఇంటర్న్ గా ఉన్నారు. ఈయన 2019లో పట్టభద్రుడయ్యాడు. వీరి ముగ్గురి వల్లే గూగుల్ లొసుగులు బయటపడి ఇప్పుడు దానిపై జరిమానాకు దారితీసింది.