spot_img
Homeజాతీయ వార్తలుKCR CBI : సీబీఐకి నో ఎంట్రీ.. బీజేపీకి షాకిచ్చిన కేసీఆర్ నిర్ణయం

KCR CBI : సీబీఐకి నో ఎంట్రీ.. బీజేపీకి షాకిచ్చిన కేసీఆర్ నిర్ణయం

KCR CBI :  తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రచ్చ చేస్తోంది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒకదాని మీద మరొకటి దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. దీంతో కోర్టుకు చేరినా పరిష్కారం మాత్రం దొరకడం లేదు. కేసులో నిందితులుగా భావిస్తున్న ముగ్గురిని రిమాండ్ కు పంపించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల కేసులో సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని బీజేపీ కోర్టును ఆశ్రయించినా తెలంగాణ సర్కారు అందుకు ససేమిరా అంటోంది. దీంతో కేసుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఫామ్ హౌస్ లో దొరికిన డబ్బు ఎక్కడిది? దానిపై విచారణ చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. మొత్తానికి తెలంగాణలో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి.

సీబీఐ విచారణకు రాష్ట్రం ఎందుకు అడ్డు పడుతోందన్నది ఇక్కడ అందరిలోనూ అనుమానాలు కలిగిస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలులో నిజానిజాలు బయటకు రావాలంటే సీబీఐ చేత విచారణ చేయించాలని బీజేపీ పట్టుబడుతుంటే అధికార పార్టీ టీఆర్ఎస్ మాత్రం ససేమిరా అంటోంది. దీంతో ఇందులో టీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉన్నట్టు స్పష్టంగా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ వారే దొంగలు కాకపోతే ఎందుకు వారు అడ్డుపడుతున్నారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యేల కొనుగోలులో గులాబీ పార్టీ హస్తం ఉందన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీల మధ్య వైరం పెరుగుతోంది. ఒక పార్టీ మరో పార్టీ మనుగడను దెబ్బకొట్టాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే బీజేపీని టార్గెట్ చేసుకుని టీఆర్ఎస్ కేసులకు వెళ్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో బీజేపీ ప్రతిష్ట మసకబార్చాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ ఇలా చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. దీనికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లక్ష్మీనరసింహ స్వామిపై ప్రమాణం చేసి ఎమ్మెల్యేల కొనుగోలులో తమ ప్రమేయం లేదని చెప్పడంతో అందరి వేళ్లు టీఆర్ఎస్ వైపే చూపిస్తున్నాయి.

ఇక కేంద్ర దర్యాప్తు సంస్థలకు తెలంగాణలో చోటు లేకుండా సంచలన నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు చేపట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని ఇదివరకే జీవో చేశారు. తాజాగా ఆ నిర్ణయాన్ని అమలు చేశారు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని కోర్టును కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటేనే వీలవుతుంది. దీంతో బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు ఒప్పుకుంటుందా? అసలు ఇందులో ఎవరెవరి హస్తం ఉంది? అనే విషయాలపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.

టీఆర్ఎస్ కావాలనే బీజేపీని టార్గెట్ చేసుకుని కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మునుగోడులో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతోనే టీఆర్ఎస్ ఇలాంటి చౌకబారు విధానాలకు తెర తీస్తోందనే వాదనలు కూడా వస్తున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన ఆడియో బహిర్గతమైనా ఇందులో టీఆర్ఎస్ నాయకుల ప్రోద్బలంతోనే ఇలాంటి వ్యవహారాలు బయటకు వస్తున్నాయని చెబుతున్నారు.

మొత్తానికి ఈ వ్యవహారం ఎటు తిరిగి ఎటు వైపు పోతుందో తెలియడం లేదు. విజయం కోసం నేతలు ఇంత దారుణానికి తెగిస్తారా? అని సందేహాలు వస్తున్నాయి. రాజకీయం అంటే అసహ్యం కలిగే స్థాయికి వెళ్లడం అందరికి జుగుస్సా కలిగిస్తోంది. ఒకప్పుడు రాజకీయాలంటే అందరికి ఎంతో గౌరవం ఉండేది. కానీ రానురాను నేతల తీరు వివాదాస్పదంగా మారుతోంది. కేసు కోర్టుకు వెళ్లిన అది ముగిసే వరకు ఎన్ని దారుణాలు చోటుచేసుకుంటాయో తెలియకుండాపోనుందని పలువురు విమర్శిస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...
Oktelugu Epaper
Exit mobile version