https://oktelugu.com/

2021 Roundup: పంతం పట్టిన కేసీఆర్ కు ఈ ఏడాది ఏం గతి పట్టింది?

2021 Roundup: 2021కు గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెప్పేందుకు ప్రజలంతా సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది చివరిరోజు కావడంతో గత స్మతులను ఓసారి మననం చేసుకుంటున్నారు. గతేడాదిలాగే ఈ ఏడాది కూడా కరోనా వల్ల ప్రజలు, ప్రభుత్వాలు ఇబ్బందులు ఎదుర్కొనక తప్పలేదు. ఇదిలా ఉంటే జ్యోతిష్యం, న్యూమరాలజీని ఎక్కువగా ఫాలో అయ్యే సీఎం కేసీఆర్ కు ఈ ఏడాది ఎలా గడిచిందో ఓ సారి చూద్దాం..! 2021 సంవత్సరం సీఎం కేసీఆర్ కు […]

Written By:
  • NARESH
  • , Updated On : December 31, 2021 11:50 am
    Follow us on

    2021 Roundup: 2021కు గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెప్పేందుకు ప్రజలంతా సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది చివరిరోజు కావడంతో గత స్మతులను ఓసారి మననం చేసుకుంటున్నారు. గతేడాదిలాగే ఈ ఏడాది కూడా కరోనా వల్ల ప్రజలు, ప్రభుత్వాలు ఇబ్బందులు ఎదుర్కొనక తప్పలేదు. ఇదిలా ఉంటే జ్యోతిష్యం, న్యూమరాలజీని ఎక్కువగా ఫాలో అయ్యే సీఎం కేసీఆర్ కు ఈ ఏడాది ఎలా గడిచిందో ఓ సారి చూద్దాం..!

    2021 Roundup

    2021 Roundup

    2021 సంవత్సరం సీఎం కేసీఆర్ కు పెద్దగా అచ్చిరాలేదనే చెప్పొచ్చు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏ చోట ఉప ఎన్నిక జరిగిన గెలుపు గులాబీ పార్టీదే అన్నట్లుగా ఉండేది. అయితే ఈ ఏడాది మాత్రం సీన్ రివర్స్ అయింది. 2021 ఏడాదిలో రాష్ట్రంలో రెండు ఉప ఎన్నికలు జరుగగా ఒక చోట టీఆర్ఎస్ గెలువగా మరోచోట బీజేపీ గెలిచి సత్తా చాటింది.

    Also Read:   మోదీ సర్కార్ బంపర్ ఆఫర్.. రూ.50కే మూడేళ్ల వారంటీతో ఐదు బల్బులు!

    నాగార్జున్ సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఆపార్టీకి చెందిన సీనియర్ నేత జానారెడ్డి పోటీ చేశారు. టీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య కుమారుడు నోముల భగత్ పోటీ చేశాడు. ఆ ఎన్నికల్లో జనారెడ్డిపై యువ నేత నోముల భగత్ గెలుపొందడం సంచలనాన్ని సృష్టించింది.

    ఇక ఈ ఏడాదిలో సీఎం కేసీఆర్ కు మాజీ మంత్రి ఈటల రాజేందర్ కంట్లో నలుసుగా మారాడు. ఈటల రాజేందర్ ను సీఎం కేసీఆర్ టార్గెట్ చేసి భూకబ్జా ఆరోపణలతో మంత్రి వర్గం నుంచి తప్పించారు. దీంతో ఆయన తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా ఉప ఎన్నికలకు వెళ్లారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ బెడసి కొట్టాయి.

    ప్రభుత్వం ‘దళితబంధు’ లాంటి ప్రతిష్టాత్మక పథకం తీసుకొచ్చినా ప్రజలు మాత్రం ఈటల రాజేందర్ వైపు మొగ్గుచూపారు. దీంతో హూజూరాబాద్ లో తొలిసారి కాషాయ జెండా రెపరెపలాడింది. దీనికితోడు దళితబంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే మిగతా సామాజిక వర్గాలు సైతం తమకు కూడా ఇలాంటి పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నారు.

    ప్రభుత్వం ఓవైపు నిధుల సమస్యతో ఇబ్బందులు పడుతుంటే మరోవైపు దళితబంధు, రైతుబంధు లాంటి పథకాల కోసం కోట్లాది రూపాయాలను ఖర్చు చేయాల్సి వస్తోంది. తెలంగాణ ప్రభుత్వంలో కొన్ని వర్గాలకే పథకాలు, పదవుల్లో న్యాయం జరుగుతుందనే విమర్శలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ ఏడాది కేసీఆర్ కు చిరాకుగా మారాయి.

    ఇక కేసీఆర్ లక్కీ నెంబర్ 6కు తగ్గట్టుగా 2022 కొత్త సంవత్సరం(2+0+2+2=6) వెల్ కమ్ చెప్పనుంది. మరీ ఈ ఏడాది కేసీఆర్ కు ఎలాంటి ఫలితాలు వస్తాయో వేచిచూడాల్సిందే..!

    Also Read:  వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి టార్గెట్ 40 సీట్లు.. మళ్లీ దానికో లెక్కుంది..?