Aditya L-1 : చంద్రయాత్రను విజయవంతం చేసిన ఇస్రో.. సూర్య యాత్రను ప్రారంభించింది. శనివారం ఉదయం ఆదిత్య ఎల్-1ను నింగిలోకి పంపింది. సూర్యుడి గుట్టుమట్లు మరింత తెలుసుకునేందుకే ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది. నిప్పుల కొలిమిలా ఉండే సూర్య గ్రహంలో ఏమాత్రం దెబ్బతినకుండా ఆదిత్యఎల్-1ను ఎలా రూపొందించింది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది? అసలు ఈ ఆదిత్య ఎలా పని చేస్తుంది. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలపై ప్రత్యేక కథనం.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఏ)కి చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ సైన్స్ టెక్నాలజీ (సీఆర్ఈఎ్సటీ) బెంగళూరుకు సమీపంలోని హోస్కోటె క్యాంప్‌సలో అభివృద్ధి చేసిన ‘విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ (వీఈఎల్సీ) ప్రతి నిమిషానికి ఒకటి చొప్పున రోజుకు 1,400 ఫొటోలు తీసి విశ్లేషణ కోసం ఇస్రోకు పంపనుంది. ఈ పేలోడ్… ఉపగ్రహ కనీస జీవిత కాలమైన ఐదేళ్ల పాటు ఫొటోలు పంపుతుందని ఐఐఏ అధికారులు పేర్కొన్నారు. ఫిబ్రవరి మధ్య నుంచి ఈ పేలోడ్ పనిచేయడం ప్రారంభమవుతుందని అంచనా. కాగా, పీఎస్ఎల్వీ రాకెట్‌లోని ప్రొపల్షన్ వ్యవస్థలకు విడి భాగాలను తిరువనంతపురానికి చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్(ఎల్‌పీఎ్‌ససీ) అందించింది. ఈ సంస్ధ అభివృద్ధి చేసిన లిక్విడ్ అపోజీ మోటార్(ఎల్ఏఎం)… మూడు చంద్రయాన్ మిషన్లతో పాటు మార్స్ ఆర్బిటార్ ప్రయోగంలోనూ కీలక పాత్ర పోషించింది.
మూన్ మిషన్ చంద్రయాన్-3 చారిత్రక విజయం సాధించింది. ఇక ఇప్పుడు సూర్యుడి వంతు. భానుడిపై పరిశోధనల నిమిత్తం ఇస్రో తొలిసారిగా చేపడుతున్న మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగం ఆదిత్య-ఎల్ 1కు రంగం సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్)లో ఈ ప్రయోగానికి శుక్రవారం మధ్నాహ్నం 12.10 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. శనివారం ఉదయం 11.50 గంటలకు పీఎ్సఎల్వీ-సీ57 రాకెట్ ఆదిత్య-ఎల్1 ఉపగ్రహంతో రోదసిలోకి దూసుకెళ్లింది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేడుతున్న తొలి మిషన్ ఇది. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతారణాన్ని లోతుగా పరిశోఽధించడమే ఈ ప్రయోగ ఉద్దేశం. ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని తొలుత జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టిన తర్వాత భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజియన్ పాయింట్-1(ఎల్-1)లోకి పంపుతారు. యూరోపియస్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ర్టేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో సూర్యుడిపై ఇస్రో అధ్యయనాలను చేపడుతోంది.
ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం బరువు 1,500 కిలోలు. దీనిలో మొత్తం 7 పేలోడ్లను పంపనున్నారు. ఇందులో ప్రధానమైన విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ (వీఈఎల్సీ)తో పాటు సోలార్ అల్ర్టావయొలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్. ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్, ఫ్లాస్మా అనలైజేషన్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెకో్ట్రమీటర్, హైఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ర్టోమీటర్, మాగ్నెటోమీటర్లు ఉన్నాయి.
సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్లను రూపొందించారు.
ఎల్-1 ప్రదేశానికి ఉన్న ఉన్న సానుకూలతల దృష్ట్యా ఇందులోని నాలుగు పరికరాలు నేరుగా సూర్యుడిని అధ్యయనం చేస్తాయి. మిగతా మూడు పేలోడ్లు సమీంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాలనుశోధిస్తాయి.
ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని రోదసిలోకి మోసుకెళ్లనున్న పీఎ్సఎల్వీ రాకెట్లో అత్యంత శక్తిమంతమైన వేరియంట్ ‘ఎక్స్ఎల్’ను ఇస్రో ఉపయోగించనుంది. 2008లో చేపట్టినచంద్రయాన్-1 మిషన్‌లోనూ, 2013లో నిర్వహించిన మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్)లో పీఎ్సఎల్వీ-ఎక్స్ఎల్ వేరియంట్లను ఉపయోగించారు.
నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి
భూ అయస్కాంత క్షేత్రాలపై ప్రభావం చూపించే సౌర కంపనాలను అధ్యయనం చేయడానికి సూర్యుడిని 24 గంటలూ పర్యవేక్షించడం తప్పనిసరి. వాటినుంచి వెలువడే కణాల ప్రవాహ తీవ్రతకు ఉపగ్రహాల్లోని ఎలకా్ట్రనిక్ పరికరాలు పాడయ్యే ప్రమాదం ఉంది. 1989లో సౌర వాతావరణంలో భారీ విస్ఫోటనం సంభవించినప్పుడు కెనడాలోని క్యూబెక్ ప్రాంతంలో దాదాపు 72 గంటలు విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. 2017లో స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ విమానాశ్రయం దాదాపు 15గంటలు ప్రభావితమైంది. కాబట్టి సూర్యుడిపై నిరంతర పర్యవేణకు ఒక పరిశీలనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అవసరం. ఎల్-1 పాయింట్ నుంచే ఇది సాధ్యం.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: 1400 photos a day features of isro aditya l 1
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com