Homeఅంతర్జాతీయంEurope: ఐరోపా లో అత్యంత ప్రమాదకరమైన 10 నగరాలివే

Europe: ఐరోపా లో అత్యంత ప్రమాదకరమైన 10 నగరాలివే

Europe: మనం చాలా వరకు పాశ్చాత్య దేశాలు చాలా అభివృద్ధి చెందాయి.. నాగరికతకు సరికొత్త అర్థం చెప్పాయి. ఆ నగరాలను చూసి.. అందులో నివసించే ప్రజలను చూసి చాలా నేర్చుకోవాలి అనుకుంటాం. కొన్ని కొన్ని విషయాలు తెలిస్తే ఆ నగరాల కంటే మన ప్రాంతాలే ఉత్తమం అనుకుంటాం. చరిత్ర ప్రకారం పురాతన సంస్కృతి విలసిల్లిన ఐరోపాఖండంలో చాలా నగరాలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. అయితే అందులో కొన్ని నగరాలు మాత్రం అత్యంత చెడ్డ పేరును మోస్తున్నాయి. ఇంతకీ ఆ ఖండంలో అత్యంత ప్రమాదకరమైన నగరాలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఫ్లోరెన్స్, ఇటలీ

ఫ్లోరెన్స్ యూరప్ ప్రాంతంలో అత్యంత ప్రాచీనమైన నగరం. కళలు, సంస్కృతి పరంగా ప్రతి ఏడాది ఈ ప్రాంతానికి వేలాది మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ప్రపంచ స్థాయి గ్యాలరీలు, డ్యుమో కేథడ్రిల్ వంటివి ఇక్కడ ప్రసిద్ధి చెందాయి. హింసపరంగా, నేరాలపరంగా ఈ ప్రాంతం మరీ అంత ప్రమాదకరమైన నగరం కాకపోయినప్పటికీ.. జేబుదొంగలు, మోసాలకు పాల్పడేవారు, క్రెడిట్ కార్డులు తస్కరించేవారు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అందుకే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులను జాగ్రత్తపరిచేందుకు అక్కడి ప్రభుత్వం ఎక్కడికి అక్కడ బోర్డులు ఏర్పాటు చేసింది.

గ్లాస్గో, స్కాట్లాండ్

గ్లాస్గో.. స్కాట్లాండ్ లో అత్యంత పురాతన నగరం. అతిపెద్ద నగరం కూడా ఇదే. ఈ ప్రాంతంలో నేరాలు తరచూ జరుగుతుంటాయి. 2010లో గ్లాస్గోలో జరిగిన హత్యలు కలకలం రేపాయి. అప్పటినుంచి ఈ నేరాలు తరచూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం సూచిస్తున్నది.

ఇస్తాంబుల్, టర్కీ

ఐరోపా, ఆసియాకు మధ్య ఇస్తాంబుల్ నగరం ఉంటుంది. ఇది టర్కీ రాజధానిగా కొనసాగుతోంది. పురాతనమైన నగరం. ఈ నగరాన్ని ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు.. అయితే 2017 లో కొన్ని హత్యలు జరిగిన నేపథ్యంలో పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని అక్కడ సూచనలు కనిపిస్తూ ఉంటాయి.

బెల్ఫా స్ట్, ఉత్తర ఐర్లాండ్

టైటానిక్ బెల్ఫాస్ట్ మ్యూజియం వంటి పర్యాటక ప్రాంతాలతో బెల్ఫాస్ట్ ఆలరారుతోంది. గతంలో ఈ ప్రాంతంలో తీవ్రస్థాయిలో నేరాలు జరిగేవి. అయితే అక్కడ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల నేరాలు తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ జాగ్రత్తగా ఉండాలని అక్కడి ప్రభుత్వం పర్యాటకులకు సూచిస్తుంది.

ఏథెన్స్, గ్రీస్

ఇది అత్యంత ప్రాచీనమైన నగరం. ప్రజాస్వామ్యం పుట్టుకకు, నాగరికత ఏర్పడేందుకు ఆలవాలమైన నగరం. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా.. ఎంతో ఘనమైన చరిత్ర కలిగి ఉన్నప్పటికీ ఈ నగరంలో కొన్ని కొన్ని వ్యవహారాలు ప్రతిబంధకంగా ఉన్నాయి. టాక్సీ స్కాములు, జేబు దొంగతనాలు, మాదకద్రవ్యాల వినియోగం , దారుణమైన నేరాలు ఈ నగరం ప్రభను మసకబారుస్తున్నాయి.

పారిస్, ఫ్రాన్స్

ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ప్యారిస్ వెలుగొందుతోంది. ఫ్యాషన్ రాజధానిగా వినతి కెక్కింది. అత్యంత రద్దీగా ఉండే ఈ నగరంలో జేబు దొంగలు అధికంగా ఉంటారు. అందుకే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు జేబు దొంగల నుంచి జాగ్రత్తగా ఉండాలని పారిస్ అధికారులు సూచిస్తుంటారు. ఈఫిల్ టవర్, లౌవ్రే మ్యూజియం వంటి ప్రదేశాల పరిధిలో నేర కార్యకలాపాలు తరచుగా జరుగుతుంటాయి. అందువల్ల ఈ ప్రాంతాలను సందర్శించే పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలి. అక్కడి అధికారులు ఈ కార్యకలాపాల నిరోధానికి చర్యలు తీసుకున్నప్పటికీ వాటికి అడ్డుకట్ట పడటం లేదు.

బ్రస్సెల్స్, బెల్జియం

ఐరోపా ఖండంలోని ఈ నగరం జేబుదొంగలకు నిలయం. ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు ఏదో ఒక సమయంలో ఈ జేబు దొంగల బారిన పడ్డవారే అయి ఉంటారు. ముఖ్యంగా రవాణా కేంద్రాలు, షాపింగ్ మాల్స్, రద్దీగా ఉండే ప్రాంతాలలో జేబు దొంగలు తమ లాఘవాన్ని ప్రదర్శిస్తుంటారు. పైగా ఇక్కడ కొంతమంది నేరస్తులు పర్యాటకులకు సంబంధించిన విలువైన వస్తువులను అత్యంత తెలివిగా దొంగిలిస్తుంటారు. అందుకే పర్యాటకులు ఈ ప్రాంతాలను సందర్శిస్తున్నప్పుడు తమ వస్తువులను అత్యంత జాగ్రత్తగా కాపాడుకోవాలని స్థానిక అధికారులు సూచిస్తుంటారు.

బుకారిస్ట్, రొమేనియా

బుకారిస్ట్ ప్రాంతం మోసాలకు, జేబుదొంగలకు ఆలవాలం. నకిలీ టాక్సీల పేరుతో పర్యాటకులను అడ్డగోలుగా దోచుకుంటారు. రద్దీగా ఉండే ప్రాంతాలలో జేబుదొంగలు తమ హస్త లాఘవాన్ని ప్రదర్శిస్తుంటారు. వల్లే ఈ ప్రాంతాలను సందర్శించే పర్యాటకులు స్వీయ జాగ్రత్త పాటించడం ఉత్తమం.

పోర్టో, పోర్చుగల్

పోర్టో అనే నగరం పోర్చుగల్ ప్రాంతంలో అత్యంత పురాతనమైనది. ఇక్కడ దోపిడీలు, దొంగతనాలు సర్వ సాధారణం. మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరాలు కూడా ఇక్కడ విపరీతంగా జరుగుతూ ఉంటాయి. రిబేరా, సావో బెంటో వంటి రైల్వే స్టేషన్ లలో సంఘవిద్రోహక కార్యకలాపాలు జరుగుతుంటాయి. ఇక్కడ జేబుదొంగల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని పర్యాటకులకు అధికారులు తరచూ సూచిస్తూ ఉంటారు.

ఆమ్ స్టార్ డ్యాం, నెదర్లాండ్

ఆమ్ స్టార్ డ్యాం నెదర్లాండ్ దేశంలో అత్యంత పురాతనమైన నగరం. ఎంతో గొప్ప సంస్కృతి కలిగి ఉన్నప్పటికీ.. ఇక్కడ నేరాలు తరచూ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా వ్యభిచారం, మాదకద్రవ్యాల వ్యాపారం ఇక్కడ ఎక్కువగా జరుగుతుంటుంది. ఇక్కడ జరిగే నేరాలు కూడా వాటి చుట్టే తిరుగుతుంటాయి. అందువల్లే పర్యాటకులను కొన్ని నిషిద్ధమైన ప్రాంతాలకు వెళ్ళొద్దని అధికారులు సూచిస్తుంటారు. ఆ ప్రాంతాల్లోకి వెళ్లకుండా ఎక్కడికక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తుంటారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular