Prashant Kishor: ప్రశాంత్ కిషోర్.. ఎన్నికల టైంలో చాలా పార్టీలు జపం చేసిన పేరు. అదేనండి ఎన్నికల వ్యూహకర్త ప్రశాత్ కిషోర్. మన తెలుగు రాష్ట్రాల్లలో కూడా ఈయన సుపరిచితుడే. 2014లో ప్రశాంత్ కిషోర్ బీజేపీతో కలిసి ఎన్నికల వ్యూహరచన చేసిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ బీజేపీ తరుఫున ప్రచార కార్యక్రమాలను ముందుండి నడిపించాడు. దీంతో అటు బీజేపీ కేంద్రంలో పాతుకుపోవడంతో పాటు.. ఇటు ప్రశాంత్ కిషోర్ సైతం రాజకీయ వ్యూహకర్తగా పేరుగడించారు. అనంతరం ఏపీలో వైసీపీ, బెంగాల్ లో టీఎంసీ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. రీసెంట్ గా తెలంగాణలో టీఆర్ఎస్ కు కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్నాడంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. మన సీఎం కేసీఆర్ కూడా ప్రశాంత్ కిషోర్ నాకు మంచి దోస్త్ అని చెప్పుకుండు.
కాగా ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ట్విట్టర్ లో స్పందించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన ఎన్నికల గారడీ గురించి ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఈ ఫలితాలను చూసి ప్రతిపక్షాలు నిరుత్సాహానికి గురికావాల్సిన అవసరం లేదన్న ప్రశాంత్ కిషోర్ దేశంలో అధికారం నిర్ణయించే ఎన్నికల్లో 2024లో జరగనున్నాయని ఇప్పటి రాష్ట్ర ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపకపోవచ్చని చెప్పుకొచ్చారు.
Also Read: YCP Politics: వైసీపీలో కట్టుదాటుతున్న క్రమశిక్షణ.. కట్టడి చేయలేకపోతున్న జగన్
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ అయ్యారు. రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో కూడా సమావేశమయ్యారు. సోనియా నివాసంలో జరిగిన ఈ భేటీలో రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే తదితర నేతలు కూడా పాల్గొన్నారు. దీంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరుతున్నారనే ఊహాగానాలకు మరింత ఊతం వచ్చింది. ప్రశాంత్ కిషోర్ తో ప్రశాంత్ కిషోర్ చేరికను పార్టీ అధిష్టానం స్వాగతిస్తోన్నట్టు సమాచారం
ఈ భేటీలో ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఓటమితో సహా అనేక ఇతర కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో ప్రధానంగా.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా పటిష్టం చేయాలి.. ఈ మేరకు అనుసరించాల్సిన వ్యూహాలేంటీ అనే విషయాలపై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
పీకే వస్తే ఏమవుతోందన్న బెంగలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు సమాచారం. పీకే కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇస్తే ఇక అతను చెప్పిందే ఫాలో అవుతారని అందుకే పీకే ఎంట్రీ ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీలో ప్రశాంత్ కిషోర్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కనీసం 370 స్థానాల్లో పోటీ చేయాలని, కొన్ని రాష్ట్రాల్లో మిత్ర పార్టీలతో పొత్తు కుదుర్చుకోవాలని సూచించినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సొంతంగా పోటీ చేయాలని తమిళనాడు, పశ్చమబెంగాల్, మహారాష్ట్ర లో మిత్రపక్షాలతో పొత్తు కుదుర్చుకోవాలని పీకే సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీలోకి పీకే వస్తే సీనియర్లకు ప్రాధాన్యం తగ్గిపోతుంది. ఆయన సలహాలతోనే పార్టీని నడుపుతారు. అందుకే సీనియర్లు ఎక్కువ మంది పీకే రాకను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Prabhas: ప్రభాస్ సీక్రెట్ పిక్ లీక్.. షాక్ లో టీమ్
Recommended Videos
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Prashant kishor asked to join congress
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com