భారత ప్రధాని మోదీ మాటలు ఎంతో ఉత్తేజపరుస్తాయి. వ్యక్తిత్వ నిపుణుడికి మించినట్లుగా ఉంటాయి. ఆయన నిత్యం ప్రవచనాలు బోధిస్తుంటారు. సామాజిక విలువలు నేర్పించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే చెప్పే మాటలు.. చేసే చేతలకు ఏ మాత్రం సంబంధం లేకుండా ఆయన రాజకీయాలు ఉంటాయని పలువురి భావన. అధికారం కోసం ఆయన అనుసరించే తీరును.. ఇన్ని మాటలు చెప్పే మోదీ ఎందుకు అదుపు చేయరన్న భావన కలగక మానదు.
Also Read: మధ్యతరగతికి మోదీ సర్కార్ శుభవార్త.. బడ్జెట్ లో 3 నిర్ణయాలు..?
సూక్తిముక్తావళిలోని మాటలకు ఏ మాత్రం తగ్గని రీతిలో మాటలు చెప్పే మోదీ.. తాజాగా ఢిల్లీలో జరిగిన ఎన్ సీసీ కెడెట్ల రిపబ్లిక్ రిహార్సల్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు నిర్వహించిన అద్భుతమైన విన్యాసాలను తిలకించారు. మోదీతో పాటు కార్యక్రమానికి రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కెడెట్లను ఉద్దేశించి మోదీ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా దేశ యువతకు కొత్త టాస్కు ఇచ్చారు మోదీ.
Also Read: రెండో విడతలో మొదటి టీకా మోడీకే..
తాజాగా దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ వేగవంతంగా సాగుతోంది. ఈ సందర్భంగా ఎన్నో అనుమానాలు.. అపోహలు.. చోటు చేసుకుంటున్నాయి. మీడియాలో వచ్చే వార్తలకు భిన్నగా.. సోషల్ మీడియాలో సత్యాలతో సంబంధంలేని కొన్ని వార్తలు ప్రచారం అవుతున్నాయి. దీంతో వ్యాక్సిన్ పై సరికొత్త సందేశాలు.. భయాలు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన ఫోకస్ ను మోదీ వ్యాక్సినేషన్ పై పెట్టినట్లు కనిపిస్తోంది.దీనికి తగినట్లే.. మోదీ తాజా వ్యాఖ్యాలు ఉన్నాయి.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. కోవిడ్ వ్యాక్సిన్ పై దేశ ప్రజలకు సరైన సమాచారం ఇవ్వడంలో యువత కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. వ్యాక్సినేషన్ పై పుకార్లను తిప్పి కొట్టేందుకు యువత నడుం బిగించాలని తెలిపారు. ప్రతీ గ్రామంలో యువత టీకాపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. పేదలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. వ్యాక్సిన్ పై తప్పడు ప్రచారాన్ని యువత నమ్మవద్దని కోరారు. కరోనాపై పోరులో భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉంటుందన్నారు. యువత కష్టపడితేనే భారత్ అన్ని రంగాల్లో స్వయం సంపత్తిని సాధిస్తుందని అన్నారు. ఎవరో చెప్పిన మాటలను వినకుండా.. యువత తన కాళ్లపై తాము నిలబడేలా ముందుకు సాగాలన్నారు.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Pm modi urges indias youth to defeat network of lies
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com