Eric Garcetti: భారత ప్రధానిగా నరేంద్రమోదీ వరుసగా మూడుసార్లు బాధ్యతలు చేపట్టి జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును సమం చేశారు. ఈ క్రమంలోనే అమెరికాకు ఎక్కువసార్లు ప్రధాని హోదాలో వెళ్లిన నేతగా చరిత్ర సృష్టించారు. పదేళ్లలో పదిసార్లు మోదీ అమెరికా వెళ్లారు. ఇది ఇరు దేశాల మధ్య సత్సంబంధాలకు నిదర్శనమని చాలా మంది భావిస్తున్నారు. అమెరికా కూడా మోదీకి రెడ్ కార్పొట్‌తో స్వాగతం పలుకుతోంది. తాజాగా క్వాడ్ సమావేశానికి ఆహ్వానం పంపింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్వయంగా మోదీని ఆహ్వానించారు. దీంతో శనివారం(సెప్టెంబర్ 21న) ఆయన అమెరికా వెళ్లారు. బైడెన్‌తో సమావేశమయ్యారు. క్వాడ్ సమావేశంలో పాల్గొన్నారు. ప్రవాస భారతీయులతో సమావేశం అయ్యారు. 15 మంది ప్రముఖ కంపెనీల సీఈవోలతో సమావేశమయ్యారు. ఇక బైడెన్ మోదీని స్వయంగా తన సొంత గ్రామంలోని ఇంటికి తీసుకెళ్లి అతిథి మర్యాదలు చేశారు. ఐక్యరాజ్య సమితి జనరల్ సమావేశంలోనూ మోదీ మాట్లాడనున్నారు. మోదీ అమెరికా పర్యటనలో ఉండగానే ఆదేశ రాయబారి ఎరిక్ గార్సెట్టీ మోదీ–బైడెన్ స్నేహంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు నేతలు రెండు దేశాల ప్రజల క్షేమం కోరుకునే నేతలు అన్నారు. భారత దేశ చరిత్రలో మోదీ లాంటి ప్రో అమెరికన్ పీఎంను ఇంతకు ముందెన్నడూ చూడలేదన్నారు. ఇక ప్రో ఇండియన్ అధ్యక్షుడిగా కూడా బైడెన్‌ను అభివర్ణించారు.
అమెరికా–భారత్ సంబాధాలపై..
అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి.. సోమవారం యూఎస్, భారత్ సంబంధాలపై మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య ఉన్న సన్నిహిత స్నేహం చాలా పురోగతికి కారణమని అన్నారు. అత్యంత స్నేహం కలిగిన నేతలు మోదీ–బైడెన్ అని తెలిపారు. వీరి స్నేహం కారణంగానే ఇరు దేశాల మధ్య బంధం బలపడుతోందని తెలిపారు. ఇటీవలి సంవత్సరాలలో వ్యూహాత్మక, ఆర్థిక, సాంస్కృతిక సహకారంలో పెరుగుదలే నిదర్శనమని పేర్కొన్నారు.
క్వాడ్ శక్తివంతమైన వేదిక..
ఇక ఇండో–పసిఫిక్ ప్రాంతంలో సహకారానికి ఇది ‘శక్తివంతమైన‘ వేదికగా క్వాడ్‌ను పేర్కొన్నారు. క్వాడ్ అనేది ఒక విజన్ సెట్ చేసే ప్రదేశమన్నారు. సూత్రాలను పంచుకోవడం, సాధారణ పరిష్కారాలను కనుగొనడం అని తెలిపారు. ఫోరమ్, క్వాడ్ సభ్యులు సమర్థించే సూత్రాలను వ్యతిరేకించే దేశాలకు కౌంటర్ బ్యాలెన్స్‌గా పనిచేస్తుందని తెలిపారు. ఇండో–పసిఫిక్ కోసం పరిష్కారాలను రూపొందించడానికి చురుకుగా పని చేస్తున్నామని తెలిపారు.
బైడెన్ స్వస్థలంలో క్వాడ్ మీటింగ్..
ఇదిలా ఉంటే.. క్వాడ్ మీటింగ్ ఈసారి భారత్‌లో నిర్వహించాల్సి ఉంది. కానీ అమెరికా వినతి మేరకు భారత్ వచ్చే ఏడాది నిర్వహించేందుకు అంగీకరించింది. ఈసారి అమెరికాకు అవకాశం ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్వస్థలం విల్మింగ్టన్, డెలావేర్‌లో క్వాడ్ సమ్మిట్ జరిగింది. ఇందులో భారత్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల ప్రధానులు నరేంద్రమోదీ, ఆంథోనీ అల్బనీస్, ఫ్యూమియో కిషిడా పాల్గొన్నారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Us ambassador eric garcetti made key comments on modi biden friendship
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com