Trivikram : త్రివిక్రమ్ తో పాటు ఇండస్ట్రీ కి వచ్చిన టాప్ రైటర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు..?
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కావడం అనేది అంత ఈజీ కాదు. ఏ క్రాఫ్ట్ లో అయిన కూడా మనకు అంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకొని అందులో మనం సక్సెస్ ఫుల్ గా రాణించగలమనే నమ్మకాన్ని పెట్టుకొని ముందుకు సాగితే తప్ప ఇక్కడ సక్సెస్ అనేది అంత ఈజీగా అయితే రాదు...
Trivikram : తెలుగు సినిమా ఇండస్ట్రీలో రైటర్ గా తన కెరియర్ ని ప్రారంభించి తను సినిమాలతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించిన రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్…అప్పట్లో ఈయన రాసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన ఎలిమెంట్ అయితే ఉండేది. దానివల్లే ఈయన కథలకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ గిరాకీ అయితే పెరిగింది. ప్రతి స్టార్ హీరో కూడా తనతో సినిమా చేయాలని ఆసక్తి చూపించారు. ఇక ఫైనల్ గా ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా సక్సెస్ ఫుల్ గా నిలవడమే కాకుండా తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇప్పుడు అందరు పాన్ ఇండియా సినిమాల బాటపడుతుంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తన తదుపరి సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ను కొల్లగొట్టాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఆయన తదుపరి సినిమా ఎవరితో చేస్తున్నాడనే విషయం మీద సరైన క్లారిటీ రావడం లేదు. కానీ ఆయన సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తాన్ని ఫైనల్ చేసి పెట్టే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకుడు ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో తన క్లాస్ మేట్ అలాగే తన ఫ్రెండ్ అయిన అబ్బురి రవి అనే రైటర్ కూడా సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. వీళ్ళిద్దరు కలిసి కొన్ని సినిమాలకు వర్క్ కూడా చేశారు. మరి ఇలాంటి సందర్భంలో అబ్బురి రవి బొమ్మరిల్లు, డాన్, కిక్, ఎవడు, మిస్టర్ పర్ఫెక్ట్, ఊపిరి లాంటి కొన్ని సక్సెస్ ఫుల్ సినిమాలకు డైలాగ్ రైటర్ గా పనిచేశాడు.
అయితే ఒకప్పుడు స్టార్ హీరో సినిమాలకు రైటర్ గా పనిచేసిన ఆయన ఇప్పుడు మాత్రం సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. రైటర్ గా తనకు అవకాశాలు రావడం లేదా అనే అనుమానలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక మొత్తానికైతే తను మంచి రైటర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఒకానొక టైంలో త్రివిక్రమ్ తో పాటు పోటీపడి మరి తను డైలాగులను రాసి మెప్పించగలిగాడు…
ఇక ఇదిలా ఉంటే అబ్బురి రవి ఇప్పుడు ఎందుకు కాముగా ఉంటున్నాడు. ఎందుకు స్టార్ హీరో సినిమాలకు రైటర్ గా చేయలేకపోతున్నాడు అనేడిస్ తెలియాల్సి ఉంది. ఇక ఆయన డైరెక్షన్ కూడా చేయబోతున్నాడు అంటూ అప్పట్లో కొన్ని వార్తలైతే వచ్చాయి…మరి దానికోసం రైటర్ గా చేయడం మానేశాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే త్రివిక్రమ్ చిన్ననాటి స్నేహితుడు అయిన అబ్బురి రవి ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగాలని కోరుకుందాం…