https://oktelugu.com/

Rishabh Pant: పంత్ షాట్ సెలక్షన్ స్టుపిడ్.. ఒంటి కాలు మీద లేచిన సునీల్ గవాస్కర్.. వైరల్ వీడియో

మెల్ బోర్న్ టెస్టులో భారత్ 5 వికెట్లు కోల్పోయినప్పటికీ..ఓ ఎండ్ లో రిషబ్ పంత్ ఉండడంతో.. టీమిటి అభిమానుల్లో ఎక్కడో ఒకచోట నమ్మకం నెలకొంది. దానికి కారణం రిషబ్ పంత్ కష్టకాలంలో మెరుగ్గా బ్యాటింగ్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండడమే. పైగా గతంలో మెల్ బోర్న్ మైదానం వేదికగా జరిగిన ఒక టెస్టులో రిషబ్ పంత్ సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడి.. భారత జట్టును గెలిపించాడు.

Written By:
  • Neelambaram
  • , Updated On : December 28, 2024 / 10:21 PM IST
    Follow us on

    Rishabh Pant: ప్రస్తుత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టీమి డే కూడా అదే తీరుగా కష్టాల్లో పడింది.. 165 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో ఆపద్బాంధవుడి పాత్ర పోషించాల్సిన రిషబ్ పంత్ దారుణంగా బ్యాటింగ్ చేశాడు. 37 బంతుల్లో మూడు ఫోర్ల సహాయంతో 28 పరుగులు చేసి సౌకర్యవంతంగా కనిపించిన.. బోలాండ్ బౌలింగ్లో అనవసరమైన షాట్ ఆడి లయన్ చేతికి చిక్కాడు. దీంతో అతనిపై విమర్శలు మొదలయ్యాయి. కష్టకాలంలో దారుణమైన షాట్ సెలక్షన్ తో వికెట్ కోల్పోయాడని క్రికెట్ విశ్లేషకులు విమర్శించడం మొదలుపెట్టారు.. ఇక సునీల్ గవాస్కర్ అయితే స్టుపిడ్ అంటూ వ్యాఖ్యానించాడు.
    28 పరుగుల వద్ద ఉన్నప్పుడు..
    రిషబ్ పంత్ అప్పటిదాకా స్వేచ్ఛ గానే బ్యాటింగ్ చేశాడు. రవీంద్ర జడేజాతో కలిసి భారత ఇన్నింగ్స్ ను చక్క దిద్దుతున్న క్రమంలో.. ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ బోలాండ్ చేతికి బంతి ఇచ్చాడు. దీంతో బోలాండ్ తన చాణక్యాన్ని ప్రదర్శించాడు. పంత్ కు ఊరించే బంతిని వేశాడు. అయితే దానిని భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించిన రిషబ్ పంత్.. నేరుగా లయన్ ఉన్నచోటకే బంతిని కొట్టాడు.. దీంతో అతడు దొరికింది అవకాశం అనుకొని బంతిని ఒడిసి పట్టుకున్నాడు. దీంతో రిషబ్ పంత్ పె విలియన్ చేరుకున్నాడు . పంత్ అవుట్ కావడంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు సంబరాలు చేసుకోగా .. టీమిండియా అభిమానులు మాత్రం నిర్వేదంలో మునిగిపోయారు. పంత్ షాట్ సెలక్షన్ పై కామెంట్రీ బాక్స్ లో ఉన్న సునీల్ గవాస్కర్ నేరుగా విమర్శలు చేశాడు. ” స్టుపిడ్.. స్టుపిడ్ . ఇది అత్యంత చెత్త షాట్. చూడ్డానికి ఇబ్బందికరంగా ఉంది . ఫీల్డర్ ఉన్న చేతికే బంతిని పంపించడం బహుశా రిషబ్ పంత్ కే చెల్లింది కాబోలు. ఇటువంటి దారుణమైన ఆట ఆడిన అతడిని డ్రెస్సింగ్ రూమ్ లోకి అనుమతించకూడదు . అసలు ఇలాంటి ఆట ఆడి జట్టును ఏం చేద్దాం అనుకుంటున్నారు.. ఆ బంతిని అలా ఆడితే నేరుగా ఫీల్డర్ వద్దకు వెళుతుందని తెలియదా.. ఆ మాత్రం తెలియకుండానే టెస్ట్ క్రికెట్ ఆడుతున్నారా” అంటూ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. మరో వైపు పంత్ అవుట్ అయిన తర్వాత.. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి రంగంలోకి వచ్చాడు. అతడు వచ్చిన తర్వాత ఆట స్వరూపం పూర్తిగా మారిపోయింది. మ్యాచ్ మొత్తం భారత్ చేతుల్లోకి వచ్చింది. నితీష్ కుమార్ రెడ్డికి వాషింగ్టన్ సుందర్ తోడు కావడంతో.. ఆస్ట్రేలియా బౌలర్లు చుక్కలు చూశారు. ఎంతమంది బౌలర్లను మార్చినా ఉపయోగం లేకపోవడంతో ఆస్ట్రేలియా కెప్టెన్ ఒకానొక సందర్భంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు.