మృణాల్ ఠాకూర్..ఈ పేరు గురించి తెలుగు రాష్ట్రాల్లో బాలీవుడ్ లో కూడా పరిచయమే అవసరం లేదు.
సీతారామం సినిమాతో అడుగుపెట్టి ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఇందులో తన నటన, అందం గురించి ఎంత చెప్పినా తక్కువే.
సీత క్యారెక్టర్ లో అద్భుతంగా ఒదిగిపోయి తెలుగు అమ్మాయిలా కనిపించింది. ఈ సినిమా తర్వాత మృణాల్ కు ఫుల్ ఆఫర్లు క్యూ కట్టాయి కూడా.
అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటూ రీసెంట్ గా విజయ్ దేవరకొండ తో ఫ్యామిలీ స్టార్ సినిమాతో కూడా మరోసారి మెరిసింది.
నానితో హాయ్ నాన్న సినిమాలో కూడా అదరగొట్టింది అమ్మడు. ఈ రెండు సినిమాలతో మంచి విజయాలను మరోసారి సొంతం చేసుకుంది బ్యూటీ.
నానితో నటించిన హాయ్ నాన్న సినిమాకు ఏకంగా బెస్ట్ యాక్ట్రెస్ విభాగంలో ఫిలింఫేర్ అవార్డు రావడంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.
అమ్మడు ఏకంగా సిల్వర్ స్క్రీన్ మీద మాత్రమే నటించలేదు. ముందు బుల్లితెర ఆర్టిస్ట్ గా కూడా నటించింది.
ఇవన్నీ పక్కన పెడితే అమ్మడు ఏ ఫోటో షేర్ చేసినా సరే అది కచ్చితంగా వైరల్ గా మారుతుంటుంది. ఆ రేంజ్ లో ఉంది మరి అమ్మడుకు క్రేజ్.