Supreme court: దేశ ప్రజలకు సర్వోన్నత న్యాయస్థానం న్యాయం చెబుతుంది. కఠినమైన కేసులలో దేశ ప్రజల ప్రయోజనార్థం తానే రంగంలోకి దిగుతుంది. సమస్య పరిష్కారానికి ఒక దారి చూపుతుంది.. మొద్దు నిద్రపోతున్న వ్యవస్థలను చర్నా కోల్ పట్టి లేపుతుంది.. అందుకే అన్ని వ్యవస్థలు విఫలమైనప్పటికీ.. నేటికీ ఈ దేశ ప్రజలకు కాస్తో కూస్తో నమ్మకం ఉందంటే అది కేవలం సుప్రీంకోర్టు మీద మాత్రమే. అయితే అలాంటి సర్వోన్నత న్యాయస్థానం తన సమస్యను పరిష్కరించుకోలేక తీవ్రంగా ఇబ్బంది పడుతోంది.
సుప్రీంకోర్టు అవసరాలకు తగ్గట్టుగా న్యాయమూర్తుల నియామకం జరగకపోవడంతో పెండింగ్ కేసులు పేరుకుపోతున్నాయి. గత పది సంవత్సరాల్లో పెండింగ్ కేసులు 8 రెట్లు పెరగడం విశేషం. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య 83,000 చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది.. 2009లో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 26 నుంచి 31కి పెంచింది. ఆ సమయంలో కేసుల పరిష్కారం వెంటనే జరిగింది. కానీ 2013లో పెండింగ్ కేసులు 50 వేల నుంచి 66,000 కు పెరిగాయి.. 2014లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సదాశివం, లోదా హయాంలో పెండింగ్ కేసుల సంఖ్య 63 వేలకు తగ్గింది.. 2015లో దత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తర్వాత పెండింగ్ కేసుల సంఖ్యను 59,000 కు తగ్గింది. 2018లో జస్టిస్ దీపక్ మిశ్రా సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు పెండింగ్ కేసుల సంఖ్య 57 వేలకు తగ్గింది.. 2019లో పార్లమెంటరీ చట్టం ద్వారా సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 31 నుంచి 34 కు పెంచేందుకు అప్పటి చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రభుత్వాన్ని ఒప్పించారు. న్యాయమూర్తుల సంఖ్య పెరగడంతో పెండింగ్ కేసుల సంఖ్య 60,000 కు పెరిగింది.. బోబ్డే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నప్పుడు కేసుల విచారణ నిలిచిపోయింది. ఆ సమయంలో కోవిడ్ విస్తృతంగా ఉండడంతో వర్చువల్ ప్రొసీడింగ్ మాత్రమే సాగడంతో.. కొన్ని కేసులు పరిష్కారం అయ్యాయి. కొవిడ్ వల్ల చాలాకాలం పాటు కోర్టు కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఫలితంగా కేసుల సంఖ్య పెరిగేందుకు ఆస్కారం ఏర్పడింది. కేసుల సంఖ్య 65 వేలకు చేరుకుంది.
రమణ చీఫ్ జస్టిస్ గా ఉన్నప్పుడు..
2021-22 లో ఎన్.వి.రమణ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్న సమయంలోనూ కోవిడ్ తీవ్రంగా ఉంది. ఆ సమయంలో కేసుల సంఖ్య 70 వేలకు చేరుకుంది. 2022 చివరి నాటికి 79 వేలకు పెరిగింది.. ఆ ఏడాది రమణ, లలిత్ చీఫ్ జస్టిస్ పదవులకు విరమణ చేశారు. ఆ తర్వాత జస్టిస్ డివై చంద్ర చూడ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ సమయంలో పెండింగ్ లో ఉన్న కేసులను తగ్గించేందుకు.. ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే కేసుల పరిష్కారంలో ఐటీ ఆధార్కా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయన తగ్గించడంతో కేసుల సంఖ్య మరో నాలుగు వేలు పెరిగి 87 వేలకు చేరుకుంది.. వాస్తవానికి కేసు మేనేజ్మెంట్ సిస్టంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా పేపర్ లెస్ కోర్టులను జస్టిస్ ఖేహర్ ప్రతిపాదించారు. ఫలితంగా కేసుల సంఖ్య 56వేలకు చేరుకుంది. అయితే చీఫ్ జస్టిస్ గా ఠాకూర్ ఉన్న సమయంలో కేసుల సంఖ్య 63 వేలకు పెరిగింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 82,831 పెండింగ్ కేసులు ఉన్నాయి.. వీటిలో ఏడాది కంటే తక్కువ వ్యవధి ఉన్న కేసులు 27,604(33%) కేసులు ఉన్నాయి. ఈ ఏడాది 38,995 తాజా కేసులు నమోదయ్యాయి. వాటిల్లో 37,158 కేసులను సుప్రీంకోర్టు పరిష్కరించింది.. ఇక దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టులలో 2014లో 41 లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. 2023 నాటికి ఆ సంఖ్య 61 లక్షలకు చేరుకుంది. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు వాటి సంఖ్య 59 లక్షలకు పడిపోయింది. ట్రయల్ కోర్టులలో 2014లో 2.6 కోట్ల కేసులు పెండింగ్ లో ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 4.5 కోట్లకు పెరిగింది.