https://oktelugu.com/

Saripodhaa Sanivaaram : ‘సరిపోదా శనివారం’ ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది..థియేటర్స్ లో ఉండగానే ఇంత తొందరగా రావడానికి కారణం అదేనా?

మరి థియేటర్స్ లో ఒక రేంజ్ లో ఆడిన ఈ సినిమా, ఓటీటీ ఆడియన్స్ లో కూడా ఆదరణ దక్కించుకుంటుందో లేదో చూడాలి. చాలా వరకు సినిమాలు థియేటర్స్ లో అద్భుతంగా ఆడినవి ఓటీటీ లో మిశ్రమ స్పందన దక్కించుకున్నాయి.

Written By:
  • NARESH
  • , Updated On : September 5, 2024 / 09:41 PM IST

    Saripodhaa Sanivaaram 5 days Box Office Collections

    Follow us on

    Saripodhaa Sanivaaram : నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని అద్భుతమైన ఓపెనింగ్స్ దక్కించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కేవలం ఓపెనింగ్స్ లో మాత్రమే కాదు, లాంగ్ రన్ లో కూడా ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లను రాబడుతూ సూపర్ హిట్ వైపు దూసుకుపోతుంది. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ చిత్రానికి దాదాపుగా 42 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అయితే వరదలు ఈ సినిమా మీద బలమైన ప్రభావం చూపుతుందేమో అని ట్రేడ్ పండితులు భయపడ్డారు. కానీ వరదలు ఈ చిత్రం వసూళ్లపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. మొదటి వారంలోనే 39 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఈ వీకెండ్ తో బ్రేక్ ఈవెన్ మార్కుని కూడా అందుకోబోతుంది.

    మరో మూడు వారాలు బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ రన్ ని ఈ చిత్రం దక్కించుకుంటుంది, ఫుల్ రన్ లో 50 కోట్ల రూపాయిల షేర్ కచ్చితంగా రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ దాదాపుగా 45 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం మరియు మలయాళం భాషల్లో ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 27 వ తారీఖు నుండి అందుబాటులోకి రాబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న మాట. ఈమధ్య సూపర్ హిట్ సినిమాలు కనీసం 10 వారల గ్యాప్ తర్వాత ఓటీటీ లో విడుదల అవుతున్నాయి. కానీ ‘సరిపోదా శనివారం’ సరిగ్గా నెల రోజుల్లో నెట్ ఫ్లిక్స్ లోకి రావడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. మరి థియేటర్స్ లో ఒక రేంజ్ లో ఆడిన ఈ సినిమా, ఓటీటీ ఆడియన్స్ లో కూడా ఆదరణ దక్కించుకుంటుందో లేదో చూడాలి. చాలా వరకు సినిమాలు థియేటర్స్ లో అద్భుతంగా ఆడినవి ఓటీటీ లో మిశ్రమ స్పందన దక్కించుకున్నాయి.

    ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ చిత్రం కూడా అలాంటి రెస్పాన్స్ ని దక్కించుకోబోతుందా?, లేదా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంటుందా అనేది ఇప్పుడు చూడాలి. నాని సినిమాలు ఓటీటీ లో బంపర్ హిట్ అయ్యాయి. ఆయన నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రానికి నెట్ ఫ్లిక్స్ లో రికార్డు స్థాయి వ్యూస్ వచ్చాయి, అందుకే ‘సరిపోదా శనివారం’ చిత్రాన్ని 45 కోట్ల రూపాయిల ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసారు. ఇది నాని కెరీర్ లోనే హైయెస్ట్ అని చెప్పొచ్చు. ఆయన తదుపరి చిత్రాలకు కూడా ఓటీటీ లో మంచి డిమాండ్ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఈ చిత్రం తర్వాత నాని ‘దసరా 2 ‘ ప్రారంభించబోతున్నాడు.