Chiranjeevi : వేట్టయన్ సినిమా చూసి చిరంజీవి నేర్చుకోవాల్సింది ఏంటంటే..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఇక తెలుగులో చిరంజీవి ఎలాంటి స్టార్ డమ్ ను సంపాదించుకున్నాడో తమిళనాడు లో రజినీకాంత్ కూడా అంతటి గొప్ప స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్లిద్దరూ మాస్ హీరోలుగా ఎదగడమే కాకుండా తమ తమ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కూడా కొనసాగుతూ ఉండటం విశేషం...

Written By: Gopi, Updated On : October 25, 2024 3:26 pm

What should Chiranjeevi learn from Vettayan movie?

Follow us on

Chiranjeevi : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తన కంటూ స్టార్ డమ్ ని సంపాదించుకున్న హీరో రజనీకాంత్... ప్రస్తుతం ఆయన 73 సంవత్సరాల ఏజ్ లో కూడా తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడానికి ఆయన ఒక పాత్ర కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు అంటే ఆయనకు సినిమా మీద ఉన్న డెడికేషన్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం రజనీకాంత్ హీరోయిన్లతో డ్యుయెట్లు పా, రొమాన్స్ చేయడం లాంటి సీన్లను చేయకుండా కంటెంట్ బేస్డ్ సినిమాలను చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు. ముఖ్యంగా ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యం అయితే సంతరించుకుంటుంది. జైలర్ సినిమాలో తన కొడుకుని కాపాడుకోవాలనే వ్యక్తి పడే బాధ ఎలా ఉంటుందో చూపించాడు. ఇక ఇప్పుడు చేసిన 'వేట్టయన్' సినిమాతో ఒక సిన్సియర్ ఆఫీసర్ డ్యూటీ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా చాలా క్లియర్ కట్ గా చూపించాడు. 
ఇలాంటి కంటెంట్ బేస్డ్ సినిమాలను చేయడం వల్ల రజినీకాంత్ మీద ప్రేక్షకుల్లో ఇంకా గౌరవం పెరుగుతూ పోతుంది. అలా కాకుండా మిగితా సీనియర్  హీరోలు హీరోయిన్లతో డ్యూయెట్లు పాడడం, రొమాన్స్ చేయడం లాంటివి చేస్తున్నారు. కాబట్టి వాళ్ల మీద గౌరవం అనేది పోతుంది అంటూ ప్రేక్షకులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేయడం విశేషం…
నిజానికి చిరంజీవి లాంటి హీరో ఇప్పటికి రొమాంటిక్ సాంగ్స్ లో నటిస్తూ లవ్ స్టోరీ లను నడుపుతూ సినిమాలు చేయడం పట్ల చాలా విమర్శలైతే వస్తున్నాయి. ఇక ఇప్పుడు రజనీకాంత్ ను చూసిన చిరంజీవి తన పంథా ను మార్చుకుంటే బాగుంటుందంటూ కొంతమంది సినీ విమర్శకులు సైతం చిరంజీవి పైన విమర్శలను గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న విశ్వంభర సినిమా హై టెక్నికల్ గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కుతుంది. కాబట్టి ఈ సినిమాలో అంత రొమాంటిక్ సన్నివేశాలు ఉండకపోవచ్చు. కానీ ఇక మీద వచ్చే సినిమాల్లో కూడా ఆయన ఒక కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని ముందుకు సాగితే బాగుంటుంది.
ఎందుకంటే ఈ ఏజ్ లో ఆయన రొమాంటిక్ సీన్స్ చేస్తే చూడడానికి ప్రేక్షకులు అంత ఆసక్తి చూపించడం లేదు. ఇప్పుడు యంగ్ హీరోలు అలాంటి సినిమాలను చేస్తున్నారు. కాబట్టి చిరంజీవి తన ఏజ్ కి తగ్గ పాత్రలు ఎంచుకొని ముందుకు సాగితే బాగుంటుందంటూ పలువురు సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…