NTR & Mahesh Babu : ఎన్టీయార్ కి మహేష్ బాబు అంటే ఎందుకు ఇష్టమో తెలుసా..?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటైపోయింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు తమను తమ స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో అయితే ఉన్నారు. ఇక బాలీవుడ్ హీరోలకు సైతం పోటీని ఇస్తూ మన హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ఇండియాలోనే నెంబర్ వన్ హీరోలుగా ఎదిగే ప్రయత్నం అయితే చేస్తున్నారు... ఇక జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు సైతం పాన్ ఇండియాలో వాళ్ల సత్తా చాటుకోవడం విశేషం...

Written By: Gopi, Updated On : October 25, 2024 3:34 pm

Do you know why NTR likes Mahesh Babu?

Follow us on

NTR & Mahesh Babu : టాలీవుడ్ ఇండస్ట్రీలో సరి కొత్త సినిమాలు వస్తూ బాక్సాఫీస్ షేక్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే స్టార్ హీరోల సినిమాల విషయంలో మాత్రం వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. నిజానికి వాళ్ళు చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడమే కాకుండా తమను తాము స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో అయితే ఉన్నారు. ఇక ఏది ఏమైనా కూడా స్టార్ హీరోల మధ్య తారతమ్యం అనేది ఎప్పుడు ఉంటూనే వస్తుంది. వాళ్ళ సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తూ ఇతర హీరోలు ఎలాంటి సినిమాలైతే చేస్తున్నారు ప్రేక్షకులు వారిని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది అబ్జర్వ్ చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే స్టార్ హీరోల అభిమానులు కూడా మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ కొన్ని వివాదాలకు కూడా తెరలేపుతుంటారు. నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబుల మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందనే విషయం మనందరికి తెలిసిందే. వీళ్ళిద్దరూ తరచుగా కలుసుకుంటూ ఒకరి సినిమాల గురించి మరొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అందువల్లే వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ అయితే కుదిరింది. నిజానికి జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు ని అన్నా అని పిలుస్తూ చాలా గౌరవంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు కూడా జూనియర్ ఎన్టీఆర్ తో చాలా చనువుగా వ్యవహరిస్తాడు. వీళ్ళ మధ్య ఉన్న బాండింగ్ ను చూసి మిగతా హీరోలందరూ కుళ్ళుకుంటారు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. నిజానికి ఎన్టీఆర్ కి మహేష్ బాబు అంటే అంత ఇష్టం ఉండడానికి గల కారణం ఏంటి అంటే మహేష్ బాబు చాలా హంబుల్ గా ఎలాంటి ఈగో లేకుండా ఎలాంటి కాంట్రవర్సీల్లో ఇరుక్కోకుండా తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు. అలాగే ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కాబట్టి ఎన్టీఆర్ కి మహేష్ బాబు అంటే చాలా ఇష్టమట. ఇక సినిమాల పరంగా చూసుకున్న కూడా మహేష్ బాబు చేసే సినిమాలు చాలా ఎక్స్పరిమెంటల్ గా ఉంటాయని కెరియర్ మొదట్లోనే ఆయన చాలా ఎక్స్పరిమెంట్ సినిమాలను చేశాడని అందుకే ఆయనంటే ఎన్టీఆర్ కి చాలా ఇష్టమని కూడా చెప్పడం విశేషం…