https://oktelugu.com/

NTR : ఎన్టీయార్ కోసం రాసుకున్న కథను లాక్కున్న స్టార్ హీరో…

సినిమా అనేది ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ గా మారిపోయింది. ప్రస్తుతం ప్రతి ఒక్కరు సినిమా ఇండస్ట్రీలో భాగమవ్వాలని కోరుకుంటున్నారు. వీలైతే నటుడిగా, లేకపోతే దర్శకుడుగా, అది లేకపోతే టెక్నీషియన్ గా అయిన మారి ఇండస్ట్రీలో గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా సినిమా అనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో కీలకపాత్ర వహిస్తుందనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : October 25, 2024 / 09:44 AM IST

    The star hero who grabbed the story written for NTR...

    Follow us on

    NTR : సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాని మరొకరు చేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. నిజానికైతే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరో తను చేయాల్సిన సినిమాని మరొక హీరో చేసి సక్సెస్ ని సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక కొంతమంది వదులుకున్న సినిమాలు మరొక హీరో కి ప్లాప్ లను తీసుకువచ్చి పెడుతుంటే మరి కొంత మందికి మాత్రం భారీ సక్సెస్ లను సాధించి పెడుతాయి. మరి ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్లాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఏది ఏమైనా కూడా సక్సెస్ వస్తే పర్లేదు లేకపోతే మాత్రం ఇక్కడ మార్కెట్ అనేది భారీగా డౌన్ అయిపోతుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈయన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరో స్టేటస్ ని అందుకున్నాడు. కేవలం 20 సంవత్సరాలు ఏజ్ లోనే స్టార్ హీరో రేంజ్ లో నిలబడిన ఆయన ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

    ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన వరుస సినిమాలను లైన్ లో పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే దేవర సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న ఆయన తన తదుపరి సినిమాతో కూడా భారీ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

    ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సిన సినిమాని మరొక స్టార్ హీరో లాక్కున్నాడనే విషయం మనలో చాలామందికి తెలియదు. నిజానికి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన కిక్ సినిమాని మొదట ఎన్టీఆర్ చేయాల్సింది. కానీ ఎన్టీఆర్ కొంత సమయం అడగడంతో సురేందర్ రెడ్డి అంత సమయం వెయిట్ చేసి అవకాశం లేకపోవడంతో అతను రవితేజతో ఈ సినిమా చేసి భారీ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక మొత్తానికైతే ఎన్టీఆర్ వదులుకున్న ఈ సినిమా రవితేజ కెరియర్ ను మార్చేసిందనే చెప్పాలి.

    మరి మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు తనదైన రీతిలో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఇక ఇలాంటి హీరో ఒకప్పుడు మంచి స్టోరీలను జడ్జ్ చేయడంలో సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. కాబట్టే ఆయన కెరియర్ అనేది ఇప్పుడు నార్మల్ గా నడుస్తుంది. ఒకవేళ ఈయన వదులుకున్న సినిమాలన్నింటిని చేసినట్లయితే ఇప్పటికే ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగేవాడు…