Dana Cyclone: రాష్ట్రానికి దానా తుఫాను ముప్పు తప్పింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయువ్యంగా పైనుంచి తుఫానుగా బలపడిన సంగతి తెలిసిందే. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ తీరం వైపు దూసుకెళ్లింది ఒడిస్సా లో తీరం దాటింది. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత తుఫాను తీరం వైపు దూసుకెళ్లింది. ఒడిస్సా లోని బిత్తర్ కనిక జాతీయ పార్క్, ధమ్రా మధ్యతుఫాను తీరం దాటింది.శుక్రవారం ఉదయం వరకుఇది కొనసాగి బలహీన పడనుంది. ప్రస్తుతం ఒడిస్సా తీరం వెంబడి భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా భద్రక్, కేంద్రపార జిల్లాల్లో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో తీవ్ర గాలులు వీస్తున్నాయి. పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. తుఫాన్ ప్రభావంతో ఒడిస్సా, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విద్యాసంస్థలకు శుక్రవారం సెలవు ప్రకటించాలని రెండు రాష్ట్రాల అధికారులకు కేంద్రం ఆదేశించింది. మరోవైపు కోల్ కత, భువనేశ్వర్ ఎయిర్ పోర్టును శుక్రవారం సాయంత్రం వరకు మూసి వేయనున్నారు. రెండు రాష్ట్రాల్లో మొత్తం 400 రైళ్లను రద్దు చేశారు.అయితే ఈ తుఫాను ప్రభావం ఏపీ పైపెద్దగా చూపలేదు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర పై ప్రభావం చూపుతుందని ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. గత అనుభవాల దృష్ట్యా ముందే మేల్కొంది. ప్రమాదం తప్పడంతో అటు యంత్రాంగం తో పాటు ఉత్తరాంధ్ర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
* అక్టోబర్ లో భయం భయం
సాధారణంగా అక్టోబర్ వచ్చిందంటే చాలు ఉత్తరాంధ్ర ప్రజలు చిగురుటాకులా వణికి పోతారు. ఈ నేపథ్యంలోనే దానా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారి.. తీరం దాటి క్రమంలో విధ్వంసం సృష్టిస్తుందని భావించారు. గత అనుభవాల దృష్ట్యా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ తరుణంలోనే ఏపీ ప్రభుత్వాన్ని సైతం అలెర్ట్ చేసింది. కానీ తుఫాను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
* ఆగస్టులో అపార నష్టం
ఆగస్టు నెలలో సంభవించిన తుఫాను ప్రభావంతో ఏపీ నష్టపోయింది. ముఖ్యంగా విజయవాడ నగరం మునిగిపోయింది. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. పెద్ద ఎత్తున పరిహారం సైతం అందించాయి. అయితే మరోసారి ఏపీకి ముప్పు ఉందని తెలియడంతో ప్రజలు భయపడ్డారు. అయితే అదే సమయంలో ప్రజలకు ముందస్తు హెచ్చరికలు పంపడంలో ప్రభుత్వం విజయవంతం అయింది. మొత్తానికైతేతుఫాను ముప్పు తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.